Mohammed Shami: టీం ఇండియాలో చోటు కోసం ‘బిర్యానీ’ త్యాగం చేసిన షమీ

Mohammed Shami: టీం ఇండియాలో చోటు కోసం ‘బిర్యానీ’ త్యాగం చేసిన షమీ
x
Highlights

Mohammed Shami: భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి బిర్యానీ తినడం అంతే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షమీ చాలా ఇంటర్వ్యూలలో బిర్యానీ గురించి మాట్లాడాడు.

Mohammed Shami: భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి బిర్యానీ తినడం అంతే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షమీ చాలా ఇంటర్వ్యూలలో బిర్యానీ గురించి మాట్లాడాడు. కానీ, టీం ఇండియాలోకి తిరిగి రావడానికి షమీ బిర్యానీని త్యాగం చేశాడు. తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఈ భారత ఫాస్ట్ బౌలర్ రెండు నెలల పాటు తనకు ఇష్టమైన ఆహారాన్ని ముట్టుకోలేదు. బెంగాల్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ శిబ్ శంకర్ పాల్, షమీ తిరిగి జట్టులోకి రావడానికి ఎంతలా కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు.

బిర్యానీ వదులుకోవడమే కాకుండా ప్రాక్టీస్ కోసం మైదానానికి మొదట వచ్చేది షమీ అని కోచ్ చెప్పారు. ఇది కాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అతను బౌలింగ్ చేసేవాడు. గాయం కారణంగా షమీ గత 14 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతను జనవరి 22 నుండి ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టుకు సెలక్ట్ అయ్యారు.

అయితే, దీనికి ముందు షమీ దేశీయ క్రికెట్ ద్వారా ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. గత నవంబర్‌లో భారత ఫాస్ట్ బౌలర్ బెంగాల్ తరపున దేశీయ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. షమీ తన కెరీర్‌ను బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్‌లతో ప్రారంభించారు. దీని తరువాత అతను సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు.

బెంగాల్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ శిబ్ శంకర్ పాల్ షమీ అంకితభావం గురించి మాట్లాడుతూ.. "ఫాస్ట్ బౌలర్లు గాయం నుండి తిరిగి రావడానికి సమయం తీసుకుంటారు. తిరిగి రావాలని అతనికి చాలా కోరిక ఉంది, ఆట ముగిసిన తర్వాత కూడా అతను బౌలింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇది ప్రతి ఆటగాడికి ఉండాల్సిన అంకిత భావం. కొంతమంది ఆటగాళ్ళు ఆట తర్వాత 30 నుండి 45 నిమిషాలు ఎక్కువసేపు బౌలింగ్ చేయాలని కోరుకుంటారు. మ్యాచ్ రోజు ఉదయం 6 గంటలకు జట్టు వచ్చే కంటే ముందే అతను మైదానానికి చేరుకునే వాడు. అతను మైదానానికి చేరుకునేవాడు." అని అన్నారు

షమీ డైట్ గురించి కోచ్ మాట్లాడుతూ.. "అతను చాలా కఠినమైన డైట్‌లో ఉన్నాడు. అతను రోజుకు ఒకసారి మాత్రమే తినడం నేను చూశాను. అతనికి బిర్యానీ అంటే ఇష్టం, కానీ తిరిగి క్రికెట్‌లోకి వచ్చినప్పటి నుండి గత రెండు నెలలుగా నేను అతనికి బిర్యానీ ఇవ్వలేదు. అతను తినడం నేను చూడలేదు" అని అన్నారు. మొత్తానికి షమీ మరో సారి తను జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి అద్భుత ప్రదర్శన చేయాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories