Top
logo

ఇమ్రాన్ ఖాన్ గొప్పక్రికెటర్... మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ గొప్పక్రికెటర్... మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు
Highlights

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై భారత్ మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ధ్వజమెత్తారు. గొప్ప క్రికెటర్ ఇమ్రాన్ మీదా తనకు చాలా గౌరవం ఉందని కానీ ఇప్పుడాయన అంటే గౌరవం లేదన్నారు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై భారత్ మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ధ్వజమెత్తారు. గొప్ప క్రికెటర్ గా ఇమ్రాన్ మీదా తనకు చాలా గౌరవం ఉందని కానీ ఇప్పుడాయన అంటే గౌరవం లేదన్నారు. ఉగ్రవాదనికి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తున్నారని దుయ్యబట్టారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను కైఫ్ ఖండించారు. ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తోంది పాకిస్థాన్ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. గొప్ప క్రీడాకారుడిగా పేరందుకున్న ఇమ్రాన్ ఉగ్రవాదుల చేతిలో కీలుబొమ్మగా మారారని, ఐక్యరాజ్య సమితిలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగమే ఇందుకు నిదర్శనమని ట్వీట్ చేశారు.
లైవ్ టీవి


Share it
Top