
Mohammad Amir: గంభీర్ తప్పుకోడు, బలవంతంగా తప్పించాల్సిందే.. మొహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు!
Mohammad Amir: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భారత్ తన చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో మరికాసేపట్లో తలపడనుంది.
Mohammad Amir: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భారత్ తన చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో మరికాసేపట్లో తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ పోరులో విజయం సాధిస్తే.. టీమిండియా నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. మరోవైపు విండీస్‌కూ ఈ మ్యాచ్‌లో గెలవడం అత్యంత ముఖ్యం. గెలిస్తే కరేబియన్లు కూడా సెమీస్ చేరుతారు. భారత్, వెస్టిండీస్ జట్లకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు ఇది ముఖ్యమైన రోజు అని, మ్యాచ్ ఫలితం తేడా కొడితే జట్టులో పెను మార్పులు కూడా సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
'విండీస్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాలోని జరిగే మ్యాచ్ భారత జట్టుకు అత్యంత కీలకం. టీమిండియాకు ఇది ముఖ్యమైన రోజు. మ్యాచ్‌లో ఏదైనా తేడా జరిగితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీకి తీవ్ర ముప్పు వాటిల్లవచ్చు. అలాగే కోచ్ గౌతమ్ గంభీర్ పదవీ కాలంపైనా ప్రభావం పడొచ్చు. భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించకపోతే.. కెప్టెన్, కోచ్ ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. బహుశా వారిద్దరూ అలా చేయరని నాకు తెలుసు. ముఖ్యంగా గంభీర్. అతడిని బలవంతంగా బయటకు పంపే వరకు పదవి నుంచి దిగిపోడు' అంటూ మొహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
'ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు మరోసారి చెబుతున్నా. ఈ రోజు భారత్ ఓడిపోతుంది. వెస్టిండీస్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది' అని తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న మొహమ్మద్ అమీర్ ధీమా వ్యక్తం చేశాడు. అదే షోలో పాల్గొన్న పాకిస్థాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ అమీర్ వ్యాఖ్యలను ఖండించాడు. భారత్ ఖచ్చితంగా వెస్టిండీస్‌ను ఓడించి.. సెమీఫైనల్‌కు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. భారత్, వెస్టిండీస్ మ్యాచ్ భారతీయుల కంటే పాకిస్థాన్ మాజీ ప్లేయర్లకే ఎక్కువగా ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి సెమీస్‌కు ఏ జట్టు చేరుతుందో.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




