టీ20 సమరానికి టీమ్​ఇండియా రెడీ.. విండీస్​ అదరగొట్టేనా?

Match Preview TeamIndia VS WestIndies T20 Series
x

టీ20 సమరానికి టీమ్​ఇండియా రెడీ.. విండీస్​ అదరగొట్టేనా?

Highlights

Teamindia Vs Westindies First T20: ఇవాళ్టి నుంచి 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌

Teamindia Vs Westindies First T20: శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలో వన్డే సిరీస్‌లో విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో కరీబియన్‌ జట్టును 5 టీ20ల సిరీస్‌లో ఢీకొనబోతోంది. చివరి వన్డే ఆడాక ఒక్క రోజు మాత్రమే విరామం తీసుకుని, ఇవాళ తొలి టీ20 ఆడబోతోంది టీమ్‌ఇండియా. వన్డే సిరీస్‌లో తుది జట్టులో ఆడిన వాళ్లలో సూర్యకుమార్, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్, అవేష్‌ ఖాన్, అక్షర్‌ పటేల్‌ మాత్రమే టీ20 సిరీస్‌లో కొనసాగనున్నారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ జరిగాక విండీస్‌తో వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరిగి ఈ సిరీస్‌లో జట్టు పగ్గాలు అందుకుంటున్నాడు. ఐపీఎల్‌ తర్వాత గాయంతో జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ ఈ సిరీస్‌లో ఆడేది అనుమానమే. మరోవైపు ఇప్పటికే వన్డే సరీస్‌ను కోల్పోయిన విండీస్ టీ20లో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories