SRK is a Traitor: నాలుక కోస్తే రూ. లక్ష రివార్డు! కేకేఆర్ ఓనర్‌పై హిందూ మహాసభ సంచలన వ్యాఖ్యలు

SRK is a Traitor: నాలుక కోస్తే రూ. లక్ష రివార్డు! కేకేఆర్ ఓనర్‌పై హిందూ మహాసభ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ జట్టులోకి తీసుకోవడంపై హిందూ మహాసభ నేత మీరా రాథోడ్ మండిపడ్డారు. షారుఖ్ ఖాన్‌ను దేశద్రోహిగా అభివర్ణిస్తూ, ఆయన నాలుక కోసిన వారికి రూ. లక్ష బహుమతి ఇస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ బాద్షా, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహ యజమాని షారుఖ్ ఖాన్ చుట్టూ రాజకీయ సెగలు ముసురుకున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టులోకి తీసుకోవడం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో, అక్కడి ఆటగాడికి కోట్లు పోసి కొనడంపై పలువురు హిందూత్వ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

షారుఖ్ నాలుక కోస్తే లక్ష రివార్డు: మీరా రాథోడ్

తాజాగా హిందూ మహాసభ నాయకురాలు మీరా రాథోడ్ షారుఖ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెరుట్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. "బంగ్లాదేశ్‌లో మన హిందూ సోదరులను దారుణంగా చంపుతుంటే, షారుఖ్ ఖాన్ మాత్రం అక్కడి ఆటగాళ్లను కోట్లు పెట్టి కొంటున్నారు. దేశ ప్రజలు ఇచ్చిన గుర్తింపుతో ఈ స్థాయికి ఎదిగి, దేశానికే ద్రోహం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్‌కు ఈ దేశంలో ఉండే హక్కు లేదు. ఎవరైనా ఆయన నాలుకను కట్ చేస్తే వారికి రూ. 1 లక్ష రివార్డు ఇస్తాం" అంటూ సంచలన ప్రకటన చేశారు.

ఎయిర్‌పోర్ట్ దాటి బయటకు రాలేరు!

కేవలం మీరా రాథోడ్ మాత్రమే కాకుండా, పలువురు బీజేపీ నేతలు కూడా కేకేఆర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ముస్తాఫిజుర్ వంటి ఆటగాళ్లు భారత్‌లో అడుగుపెడితే ఎయిర్‌పోర్ట్ దాటి బయటకు రాలేరని హెచ్చరించారు. ఆధ్యాత్మిక గురువు దేవకినందన్ ఠాకూర్, బీజేపీ నేత సంగీత్ సోమ్ వంటి వారు ఇప్పటికే షారుఖ్‌ను విమర్శిస్తూ, వెంటనే రెహమాన్‌ను జట్టు నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

రూ. 9.2 కోట్లకు కేకేఆర్ చెంతకు..

బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ 2026 మెగా వేలంలో భారీ ధర పలికాడు. తొలుత అన్‌సోల్డ్ అయినప్పటికీ, తర్వాత జరిగిన బిడ్డింగ్‌లో రూ. 9.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని సొంతం చేసుకుంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లకు ఆడిన అనుభవం ఉన్న ముస్తాఫిజుర్‌ను తీసుకోవడం ఇప్పుడు కేకేఆర్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ "Boycott KKR" అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరి ఈ వివాదంపై షారుఖ్ ఖాన్ లేదా కేకేఆర్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories