Mary Kom: మీడియా సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా.. మేరీకోమ్‌ సంచలన నిర్ణయం..!

Mary Kom
x

Mary Kom: మీడియా సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా.. మేరీకోమ్‌ సంచలన నిర్ణయం..!

Highlights

Mary Kom: తన జీవితంలో గత రెండేళ్లు చాలా కష్టంగా గడిచిన వేళా మద్దతుగా నిలిచిన తన అభిమానులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపింది.

Mary Kom: ఒలింపిక్ పతక విజేత, భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ తన వ్యక్తిగత జీవితంపై ఉన్న ఊహాగానాలపై విరుచుకుపడింది. 2023 డిసెంబర్ 20న తన భర్త కరుంగ్ ఓంకోలర్‌తో విడాకులు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఆమె ఓ వ్యాపార భాగస్వామితో సంబంధం పెట్టుకుందన్న వార్తలు ప్రచారంలో ఉండగా, వాటిని ఆమె పూర్తిగా ఖండించింది.

తన న్యాయవాది ద్వారా విడుదల చేసిన ప్రకటనలో మేరీ కోమ్ తెలిపిన వివరాల ప్రకారం, విడాకులు పరస్పర అంగీకారంతో KOM సంప్రదాయ చట్టం ప్రకారం కుటుంబ సభ్యులు, వంశ పెద్దల సమక్షంలో ఖరారయ్యాయని వెల్లడించారు. గత రెండేళ్లుగా విడిపోయి జీవిస్తున్నట్టు పేర్కొన్నారు.

హితేష్ చౌధరీ అనే వ్యాపార భాగస్వామితో సంబంధం పెట్టుకుందన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చిచెప్పింది. మరో బాక్సర్ భర్తతో ఉన్నదన్న రూమర్లూ అవాస్తవమేనని తెలిపింది. మీడియా తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా పుకార్లు ప్రచారం చేయొద్దని కోరింది.

తన జీవితంలో గత రెండేళ్లు చాలా కష్టంగా గడిచిన వేళా మద్దతుగా నిలిచిన తన అభిమానులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపింది. ఇకపై ఈ విషయంలో , మీడియా సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మణిపూర్‌లో ఇప్పటికే ఓ ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడించామని, ఇకపై ఎవరు తన గౌరవాన్ని హరించినా న్యాయపరంగా ప్రతిస్పందిస్తామని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories