కెప్టెన్సీ భారంగా ఉంది: లసిత్ మలింగా

కెప్టెన్సీ భారంగా ఉంది: లసిత్ మలింగా
x
Highlights

శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగా చెత్త రికార్డును తన ఖాతాలో చేసుకున్నాడు.

శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగా చెత్త రికార్డును తన ఖాతాలో చేసుకున్నాడు. మలింగ కెప్టెన్సీలో ఆడిన 11 మ్యాచ్ లో 10 ఓడిపోయడంతో వరస ఓములను నమోదు చేసుకున్న తొలి కెప్టెన్ గా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్ కోల్పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంక జట్టు నుంచి పూర్తి స్థాయిలో ఆశించిన ప్రదర్శన కనబరచకపోవడంతోనే టీమిండియా ముందు ఘోరంగా పరాభవం పాలైందన్నారు.

అంతే కాకుండా తన వ్యక్తి ఆటతీరుపై మలింగ విమర్శించుకున్నాడు. నేను చాలా అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడాను, చాలా అనుభవం ఉన్న క్రికెటర్ వికెట్ తీసుకుంటాను అనే పేరు ఉంది, అయితే భారత్ తో ఆడిన రెండు మ్యాచ్ ల్లో వికెట్ తీయకపోవడం నిరాశకు గరిచేసిందని తెలిపారు. తీవ్ర ఒత్తిడికి లోనైనా, మలింగ ఆవేదన వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ ప్రధానంగా కూడా నాపై భారం చూపిందని వ్యాఖ్యానించాడు.

2014లో శ్రీలంక కెప్టెన్ గా చేసిన సమయంలో తనకు భారంగా అనిపించలేదు అప్పుడు కుమార సంగక్కరా, జయవర్ధనే, దిల్షాన్‌ అనుభం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వారి భాగా రాణిస్తున్నారు. అందువల్ల తనకు కెప్టెన్సీ పెద్ద బారం అనిపించలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంక యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం తక్కువగా ఉంది. అందుకే కెప్టెన్సీ భారం అనిపించింది. అయితే టీ20ల్లో విలువైన భాగస్వామ్యం చాలా ముఖ‌ం కూడా అన్నాడు. తమ ఆటగాళ్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో విఫలమైయ్యారని తెలిపారు. ఓపెనర్లు శుభారంభం ఇవ్వాల్సిన అవసరం ఉటుందని భారత ఆటగాళ్ల కంటే శ్రీలంక ఆటగాళ్లు శుభారంభం ఇవ్వడంలో విఫలమైయ్యారని అన్నాడు. ఏడాది కాలంగా తన ప్రదర్శన బాగాలేదు అని తెలిపాడు

మరొకవైపు భారత్ బ్యాటింగ్‌ అమోఘంగా ఉందన్నాడు. ప్రతి ఒక్కరు అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసించాడు. ‎శ్రీలంక జట్టు అంటే పటిష్టంగా ఉండేది కానీ ఇప్పడు శ్రీలంక జట్టు అంత పటిష్టంగా లేదని. సంగక్కరా,మహేలా జయవర్ధననే, దిల్షాన్‌లు శ్రీలంకను విజయాల్లో కీలక పాత్ర పోషించేవారిని తెలిపాడు. ఇప్పుడు ఉన్న ఆటగాళ్లకు మంచి టాలెంట్ ఉంది, కీలక సమయంతో ఏలా ఆడాలో తేలియక విఫలమవుతున్నారని మలింగ అన్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories