బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన... షకీబ్ స్థానంలో కెప్టెన్‌గా..

బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన...  షకీబ్ స్థానంలో కెప్టెన్‌గా..
x
Highlights

మూడు టీ20లు, రెండు టెస్టులు సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. నవంబర్ మూడు నుంచి సిరీస్ ప్రారంభం కానునుంది. తాజాగా బంగ్లా జట్టును బీసీబీ ప్రకటించింది.

మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. నవంబర్ మూడు నుంచి సిరీస్ ప్రారంభం కానునుంది. తాజాగా బంగ్లా జట్టును బీసీబీ ప్రకటించింది. బుకీల వివరాలు తెలిజేయలేదని రెండేళ్లు పాటు నిషేదం కెప్టెన్ షకీబుల్ హసన్ పై ఐసీసీ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. షకీబుల్ హసన్ స్థానంలో టీ20లకు కెప్టెన్ గా మహ్మదుల్లాను,టెస్టు జట్టుకు కెప్టెన్ గా మిమునల్ హక్ ను ప్రకటించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. నవంబర్ 14 నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత్ బంగ్లా ఈడెన్ గార్డెన్స్‌లో తొలి డే ఆండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి. మొదట జట్టును ప్రకటించిన బంగ్లా అనూహ్యంగా షకీబుల్ పై వేటు పడడంతో మరోసారి జట్టును ప్రకటించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ కూడా జట్టు నుంచి తప్పుకున్నారు.

బంగ్లా జట్టు వివరాలు ఇలా ఉన్నాయి ఓపెనర్ లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నయీమ్ షేక్, ఎండీ మిథున్, అపిప్ హుస్సేన్, ఆర్పాత్ సన్నీ, తైజుల్ ఇస్లామ్, హుస్సేన్ సైకత్, అమినుల్ ఇస్లామ్, అబు హైదర్, ఆల్ అమిన్ హుస్సేన్ సైపుల్ ఇస్లామ్ గల సభ్యలులు ప్రకటించింది.

బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు కెప్టెన్ గా మిమునల్ హక్ వ్యవహరించనున్నాడు.‎ఇమ్రూల్ కైస్ టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. లిట్టన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, షదామన్ ఇస్లామ్, సైప్ హసన్, ఎండీ మిథున్, హుస్సేన్ సైకత్,ముస్తాఫిజుర్ రెహ్మాన్, మెహదీ హసన్, తైజుల్ ఇస్లామ్, అల్ అమిన్ హుస్సేన్, నయీం హసన్, అబు జావెద్, ఎబడాత్ హుస్సేన్ ను బీసీబీ ప్రకటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories