పంజాబ్ దూకుడుకు కళ్లెం వేసిన లక్నో.. 20 పరుగుల తేడాతో విజయం...

Luknow Super Gaints Won the Match with Punjab Kings IPL 2022 Highlights | Cricket Live News
x

పంజాబ్ దూకుడుకు కళ్లెంవేసిన లక్నో.. 20 పరుగుల తేడాతో విజయం...

Highlights

IPL 2022 - PBKS vs LSG: ప్లేయర్ ఆఫ్‌దిమ్యాచ్ అవార్డు అందుకున్న కృణాల్ పాండ్యా...

IPL 2022 - PBKS vs LSG: ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ దూకుడుకు లక్నో కళ్లెం వేసింది. టాస్ గెలిచిన పంజాబ్ లక్ష్యచేదనలో చతికిలపడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లుకోల్పోయి 153 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతేలేసి లక్నోను తక్కువ పరుగులకే కట్టిచేయగలిగినప్పటికీ... పంజాబ్ బ్యాట్స్ మెన్లు పరుగుసాధించడంలో విఫలమయ్యారు. 20 పరుగుల తేడాతో లక్నో విజయాన్ని చేజిక్కించుకుని 12 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాగింది.

ఇప్పటిదాకా 9 మ్యాచులు ఆడిన లక్నో ఆరు విజయాలు సొంతంచేసుకుంది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో నాలుగు ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి, ఒకమెయిడిన్ ఓవర్, రెండు వికెట్లను పడగొట్టి, ఫీల్డింగ్ లో కీలక పాత్రపోషించిన కృణాల్ పాండ్యా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. లక్నో బ్యాట్స్ మెన్లలో క్వింటన్ డీకాక్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా, దీపక్ హుడా 34 పరుగులు చేయగలిగారు. మిగిలిన వారంతా చెప్పుకోదగ్గస్కోరు చేయలేకపోయారు.

దీంతో 153 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్ కగిసో రబాడా నాలుగు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు. రాహుల్ చాహర్ కు రెండు వికెట్లు, సందీప్ శర్మకు ఒక వికెట్ లభించింది. 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 133 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ ఆటగాళ‌్లలో జానీ బెయిర్ స్టో 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మయాంక్ అగర్వాల్ 25 పరుగులు, రిషిధావన్ 21 పరుగులు, లివింగ్ స్టోన్ 18 పరుగులు అందించారు. లక్ష్యచేదనలో తడబడటంతో లక్నో విజయాన్ని కైవసం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories