LSG vs PBKS: బోణీ కొట్టిన లక్నో.. పంజాబ్‌పై ఘన విజయం..

Lucknow Super Giants Wins With 21 Runs Against Punjab Kings
x

LSG vs PBKS: బోణీ కొట్టిన లక్నో.. పంజాబ్‌పై ఘన విజయం.. 

Highlights

LSG vs PBKS: విజయానికి చేరువయ్యే సమయంలో దెబ్బకొట్టిన మయాంక్

LSG vs PBKS: ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతంచేసుకుంది. టాస్ గెలిచిన లక్నో కెప్టన్ నికోలస్ పూరన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 178 పరుగులతో సరిపెట్టుకుంది. దీంతో లక్నో జట్టు 21 పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కించుకుని, ఐపీఎల్ సీజన్లో బోణీ కొట్టింది.

లక్నోజట్టలో క్వింటన్ డీకాక్ 54 పరుగులతో టాప్ స్కోరర్ కాగా, 43 పరుగుల వ్యక్తిగత స్కోరుతో కృణాల్ పాండ్యా అజేయంగా నిలిచాడు. కెప్టన్ నికోలస్ పూరన్ 42 పరుగులు నమోదు చేశాడు. మార్కస్ స్టాయినిస్ 19 పరుగులు, లోకేశ్ రాహుల్ 15 పరుగులతో సరిపెట్టుకున్నాడు. మిగతావారంతో సింగిల్ డిజిట్ స్కోరుతో సరిపెట్టుకున్నారు.

200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. కెప్టన్ శిఖర్ దావన్, జానీ బెయిర్ స్టో ఓపెనర్లుగా పటిష్టమైన పునాది వేశారు. తొలివికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యంగా నిలిచారు. లక్నోపై పంజాబ్ విజయం సాధించే దిశగా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ అద్భుతమైన బంతులు సంధించి కీలకమైన వికెట్లను పడగొట్టి, పరుగుల ప్రవాహానికి అడ్డుకట్టవేశాడు. బ్యాటింగ్‌తో దూకుడు ప్రదర్శిస్తున్న బెయిర్ స్టో, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మలను ఔట్ చేసి ఆటను మలుపు తిప్పాడు. దీంతో లక్నో జట్టు విజయం సాధించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి మయాంక్ యాదవ్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.

పంజాబ్ కింగ్స్ తరఫున కెప్టన్ శిఖర్ ధావన్ 70 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెయిర్ స్టో 42 పరుగులు అందించాడు,. లియాం లివింగ్ స్టోన్ 28 పరుగులతో అజేయంగా నిలవగా ప్రభ్ సిమ్రాన్ సింగ్ 19 పరగుులు, శశాంక్ సింగ్ 9 పరుగులు, జితేశ్ శర్మ 6 పరుగులతో సరిపెట్టుకున్నారు.

ఇవాళ మ‌ధ్యాహ్నం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదుచేసి రికార్డుల్ని బద్దలు కొట్టిన హైదరాబాద్ జట్టు గుజరాత్‌కు సవాలు విసురుతోంది. అన్నివిభాగాల్లో ప్రతిభావంతమైన జట్టుగా ఉన్న హైదరాబాద్ జట్టు, గుజరాత్ టైటాన్స్ పై పట్టుసాధించేందుకు అన్ని రకాల వ్యూహాలతో బరిలోకి దిగబోతోంది. హోం గ్రౌండ్ ‌ సంచలన విజయాన్ని సాధించి, ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేయాలని గుజరాత్ కెప్టన్ శుభ్ మన్ గిల్ జట్టును సమాయాత్తం చేశాడు. మరో సాధికార విజయంతో ఈ సీజన్లో రెండో విజయంకోసం హైదరాబాద్ కెప్టన్ ప్యాట్ కమిన్స్ అన్ని వ్యూహాలతో జట్టును సంసిద్ధం చేశారు.

విశాఖ వేదికగా మరో ఐపీఎల్ మ్యాచ్ ఇవాళ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ హోరాహోరీగా తలపడబోతున్నాయి. రెండు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, తొలి విజయంకోసం ఎదురు చూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇవాళ ఆసక్తికర పోరు జరుగనుంది. విశాఖలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ కొట్టాలని చెన్నై ఉవ్వీళ్లూరుతోంది. చెన్నై కెప్టన్ రుతురాజ్ గైక్వాడ్, ధోనీ కన్నుసన్నల్లో జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. అద్భుతమైన ఆటతీరు, దూకుడు స్వభావం ఉన్న ఆటగాళ్ల సాయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొలివిజయాన్ని నమోదు చేయాలని కెప్టన్ రిషబ్ పంత్ ఆటగాళ్లను సమాయాత్తం చేశారు. మరి ఇవాళ జరిగే మ్యాచ్‌లో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories