క్రికెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి

క్రికెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి
x
Ravi Shastri (File Photo)
Highlights

సౌతాఫ్రికా సిరీస్‌కు సిద్ధమవుతున్నప్పుడే కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఊహించామని టీమిండియా కోచ్ రావిశాస్త్రి అన్నారు.

సౌతాఫ్రికా సిరీస్‌కు సిద్ధమవుతున్నప్పుడే కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఊహించామని టీమిండియా కోచ్ రావిశాస్త్రి అన్నారు. మార్చి 12 నుంచి 18 వరకు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే, వర్షం కారణంగా ధర్మశాలలో తొలివన్డే రద్దైంది. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందడంతో రెండో మ్యాచ్‌కు ముందు సిరీస్‌ను వాయిదా వేశారు. రెండో వన్డే రద్దు కాగానే లాక్‌డౌన్‌ లాంటి పరిస్థితి తప్పదనిపించింది. వైరస్‌ ప్రభావం అధికంగా ఉంటుందని టీమ్ఇండియా గ్రహించిదన్నారు.

తాజాగా రవిశాస్త్రి స్కై క్రికెట్‌తో మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ సమయంలో క్రీడలు స్తంభించిపోయే అవకాశం ఉందని టీమిండియా క్రికెటర్లకు తెలుసని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరిస్తున్న వేళ, ముఖ్యంగా భారత్‌లో వ్యాప్తిచెందుతున్న సమయంలోనే న్యూజిలాండ్‌ పర్యటన నుంచి టీమిండియా వచ్చిందన్నారు. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిసి ఏదో జరుగుతుందని ఊహించామని చెప్పాడు.

మన క్రికెటర్లు న్యూజిలాండ్‌లోనే దీనిని ఊహించారని, సింగపూర్‌ నుంచి రావడంతో కాస్త ఆందోళన పడ్డారని రవిశాస్త్రి అన్నారు. టీమిండియా క్రికెటర్లు మన దేశంలో దిగేసరికి ఊపిరిపీల్చుకున్నారు. సరైన సమయంలోనే వచ్చేశామని అనుకున్నామని వెల్లడించారు.టీమ్‌ఇండియా క్రికెట్ జట్టు ఇక్కడికి వచ్చిన రోజు నుంచే ప్రజలను స్క్రీనింగ్‌ చేయడం మొదలెట్టారు అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరి దృష్టి ఆరోగ్య భద్రతపైనే ఉండాలని, క్రికెట్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు.

అందరికీ వైరస్‌ ప్రభావంపై అవగాహన కల్పించాలని తమ ఒక్కరి భద్రతే కాకుండా ప్రజల భ్రదత గురించి కూడా ఆలోచించాలని చెప్పాడు. ఈ విషయంలో భారత్ ఆటగాళ్లు ముందున్నారని, విరాట్‌ కోహ్లీతో సహా చాలా మంది క్రీడాకారులు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను అప్రమత్తం చేస్తున్నారని అన్నాడు. ఇండియా న్యూజిల్యాండ్.. ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ పర్యటన తర్వాత మార్చి తొలివారంలో స్వదేశానికి తిరిగివచ్చింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా ఈవెంట్లు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌ సైతం ఏడాది వాయిదా పడింది. ఇక భారత్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ పై ఏప్రిల్ 15 తర్వాత నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories