బంగ్లా క్రికెటర్ ఇంట్లో సిలిండర్ పేలుడు.. భార్యకు తీవ్ర గాయాలు

బంగ్లా క్రికెటర్ ఇంట్లో సిలిండర్ పేలుడు.. భార్యకు తీవ్ర గాయాలు
x
liton das, sanchita
Highlights

బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ గ్యాస్ సిలిండర్ పేలి అతని భార్య దేవశ్రీ బిస్వాస్ సంచితకు తీవ్ర గాయాలైయాయి.

బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ గ్యాస్ సిలిండర్ పేలి అతని భార్య దేవశ్రీ బిస్వాస్ సంచితకు తీవ్ర గాయాలైయాయి.గత శుక్రవారం వంట గదిలో సిలిండర్ పేలడంతో సంచిత తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

గ్యాస్ సిలిండర్‌‌కు రంధ్రం పడి ఉండంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు లిటన్ దాస్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. సిలిండర్‌‌కు పడిన రంధ్రం ద్వారా గ్యాస్ లీకైందని దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఆ సమయంలో సంచిత తన చేతులకు , శారీరనికి గాయాలయ్యాయని తెలిపారు. అయితే పేలుడు కారణంగా ఆమె జుట్టు కాలిపోయిందని తెలిపారు.

ఈ ప్రమాదంపై సంచిత మాట్లాడారు ' ప్రమాదం గురించి వివరించేందుకు మాటలు రావడం లేదు. సిలిండర్ పేలి గానే నా చేతులతో ముఖాన్ని కవర్ చేసుకోలేకపోతే.. నా ముఖం మొత్తం కాలిపోయేది.చావుని దగ్గరగా వెళ్లినట్లు అనిపించింది. నా జుట్టు కూడా కట్ చేయాలని వైద్యులు తెలిపారు. ఒకవేళ నా ముఖం కాలి ఉంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి'అని తెలిపింది. 2019లో సంచితని లిట్టన్ దాస్ వివాహం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌లో కరోనా వైరస్ పోరాటానికి లిప్టన్ దాస్ తన సగం జీతాన్ని విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories