పాకిస్తాన్‌ పర్యటనకు కెప్టెన్‌గా సంగక్కరా

పాకిస్తాన్‌ పర్యటనకు కెప్టెన్‌గా సంగక్కరా
x
Kumar Sangakkara File Photo
Highlights

2009లో పాకిస్తాన్‌ పర్యటించిన శ్రీలంక క్రికెట్ జట్టుపై లాహోర్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డ సంగతి తెలిసిందే.

2009లో పాకిస్తాన్‌ పర్యటించిన శ్రీలంక క్రికెట్ జట్టుపై లాహోర్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డ సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు మరోసారి శ్రీలంక ఎంసీసీ నుంచి ఓ జట్టు వెళ్లనుంది. అందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ దేశంలో క్రికెట్ రక్షించాలని శ్రీలంక బోర్డుకు విజ్ఞప్తి చేసింది. పీసీబీ విజ్ఞప్తి మన్నించిన శ్రీలంక తమ జట్టును లాహోర్‌కు పండానికి అంగీకరించింది. అయితే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్ (ఎంసీసీ) జట్టుకు మాజీ ఆటగాడు కుమార సంగకర కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్ ఎంసీసీ తాజాగా ధృవీకరించింది.

మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్ అధ్యక్షుడిగా సంగక్కరా కొనసాగుతున్నాడు. అతని సారథ్యంలోనే ఎంసీసీ జట్టు కూడా పాకిస్తాన్ లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా ఎంసీసీ ఓప్రకటన జారీ చేసింది. పాకిస్తాన్ లాంటి దేశాల్లో క్రీడలను బతికించడం చాలా ముఖ్యం, పాక్ లో క్రికెట్ కాపాడాలనే లక్ష్యంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఇప్పటికే పలు మ్యాచ్ లు నిర్వహించింది. ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు తాము కూడా సిద్దం అంటూ ఎంసీసీ ప్రకటించింది. 2009లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన ఉగ్రదాడిలో పలువురు క్రికెటర్లు గాయాలైయ్యాయి. ఆప్పట్లో పాక్ లో పర్యటించిన శ్రీలంక జట్టులో కుమార సంగక్కరా ఒకరు. ఆ ఘటనలో సంగక్కరా గాయపడ్డాడు.

శ్రీలంక క్రికెటర్లపై జరిగిన ఉగ్రదాడితో అంతర్జాతీయ క్రికెట్ జట్లు ఏవీ పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లడానికి నిరాకరించాయి. అయితే పాక్ లో ఇటీవలే జింబాబ్వేతో జట్టు పర్యటించింది. ఆతర్వాత 10ఏళ్ల తర్వాత భద్రత పరమైన హామీలతో శ్రీలంక ద్వితీయశ్రేణి జట్టు కూడా ఆ దేశంలో పర్యటించింది. శ్రీలంక పాకిస్తాన్ మధ్య రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టు డ్రాగా ముగిసింది. కరాచీలో వేదికగా రెండో టెస్టు గురువారం నుంచి ఆరంభం కానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories