IPL 2021 MI vs KKR Preview: నేటి ఆసక్తికరమైన పోరుకి ముంబయి, కోల్‌కతా సిద్ధం

Kolkata Knight Riders Vs Mumbai Indians Match Preview
x

ముంబయి ఇండియన్స్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్ (ఫొటో ట్విట్టర్) 

Highlights

IPL 2021 MI vs KKR Preview: ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో ఆసక్తికరమైన పోరుకి రంగం సిద్ధమైంది.

IPL 2021 MI vs KKR Preview: ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో ఆసక్తికరమైన పోరుకి రంగం సిద్ధమైంది. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోరంగా ఓడిపోయింది ముంబయి ఇండియన్స్. ఇక తన రెండో మ్యాచ్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం రాత్రి 7:30 గంటలకు తలపడబోతోంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ తాను ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 10 పరుగుల తేడాతో గెలిచింది. ఎలాగైనా గెలవాలని ముంబయి టీం కసితో కనిపిస్తోంది. కాబట్టి, ఈ మ్యాచ్ నిన్నటి మ్యాచ్ లా థ్రిల్లింగ్ గా మారబోతోందని తెలుస్తోంది. హిట్టర్లతో నిండిని ఈ రెండు జట్ల పోరులో ఓవరాల్ గా చూసుకుంటే ముంబయి టీందే కనిపిస్తోంది.

పోటీ పడే జట్లు: ముంబయి ఇండియన్స్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్ (MIvsKKR)

ఎప్పుడు: రాత్రి గం 7:30 నిమిషాలకు

ఎక్కడ: ఎంఏ చిదంబరం స్డేడియం, చెన్నై(చేపాక్ స్టేడియం)

గత మ్యాచ్‌లో స్కోర్లు: చేపాక్ స్టేడియంలో గత రెండు మ్యాచ్ ల్లో నమోదైన స్కోర్లు.. 159, 160, 187, 177. అయితే ఛేజింగ్ చేయడంలోనూ పెద్దగా ప్రయోజనం లేదనిపిస్తోంది. టాస్ గెలిస్తే మాత్రం టీంలు ముందుగా బౌలింగ్ తీసుకోవచ్చు.

మీకు తెలుసా..

- ముంబయి ఇండియన్స్ టీం 2013 నుంచి తొలి మ్యాచ్ లో ఓడిపోయి.. రెండో మ్యాచ్ తో విజయాల బాట పడుతున్నారు. గత ఐదు సీజన్లలో నాలుగు సీజన్లలో ఇలానే జరిగింది. కాగా, వాటిలో మూడు విజయాలు కోల్‌కతా టీం పైనే గెలిచారు.

- నితీష్ రానా తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో మూడు సార్లు డకౌట్లు, మూడు సార్లు 80 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. 0(1), 81(53), 0(1), 87(61), 0(1), 80(56).


రికార్డులు

ఇరు జట్ల పోటీలో ముంబయి ఇండియన్స్ దే ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 21 మ్యాచ్‌ల్లో ముంబయి టీమ్‌ విజయం సాధించింది. కేవలం ఆరు మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలిచింది.

ఐపీఎల్ టోర్నీలో ముంబయిపై కోల్‌కతా నైట్‌రైడర్స్ చేసిన అత్యధిక స్కోరు 232 పరుగులు. కోల్‌కతాపై ముంబయి ఇండియన్స్ చేసిన అత్యధిక స్కోరు 210 పరుగులు. ఇక ఐపీఎల్ 2020 సీజన్‌లో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ ముంబయి ఇండియన్స్ గెలిచింది.


5 టైటిళ్లతో ముంబై... 3 టైటిళ్లతో కోల్‌కతా...

టైటిల్స్ పరంగా చూస్తే.. ముంబయి ఇండియన్స్ ఎక్కువ టైటిల్స్ సాధించింది. ముంబయి ఇండియన్స్ వరుసగా 2013, 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్ టైటిల్స్ ను గెలిచింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 2012, 2014లో విజేతగా నిలిచింది.

క్రీజులో ఎక్కువ సేపు నిలిచేదెవరో..

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో ముంబయి ఓపెనర్ క్రిస్‌లిన్ ఫర్వాలేదనిపించాడు. కానీ, కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్‌కి కారణమయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ అంచనాల్ని అందుకోవడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ లోనైనా ఎక్కువ సేపు క్రీజులో నిలిచి, భారీ స్కోర్ సాధించి గెలవాలనే కసితో కనిపిస్తోంది ముంబయి టీం.


బౌలింగ్ పరంగా ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, జాన్సన్ బలంగా కనిపిస్తున్నారు. మొదటి మ్యాచ్ లో వీరు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. కానీ.. స్పిన్నర్ రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా భారీగా పరుగులిచ్చి ఓటమికి కారణమయ్యారు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరిపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. వారి స్థానంలో జయంద్ యాదవ్‌ని టీమ్‌లోకి తీసుకునే సూచనలున్నాయి. బెంగళూరుతో మ్యాచ్‌కి క్యారంటైన్‌లో ఉన్న డికాక్.. టీమ్‌లోకి రీఎంట్రీ ఇస్తే.. ఓపెనర్ క్రిస్‌లిన్‌ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది.

బ్యాటింగ్ లో ఓకే... మరి బౌలింగ్ లో...

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో ఓపెనర్ నితీశ్ రాణా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 80 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. మరో ఓపెనర్ శుభమన్ గిల్, పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ విఫలమయ్యారు. రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ పవర్ హిట్టింగ్ తో హైదరాబాద్‌పై కోల్‌కతా మెరుగైన స్కోరు చేసింది. రసెల్ లేదా మోర్గాన్ తమ బ్యాట్ కు పదును పెట్టాలని టీం ఆశిస్తోంది.


బౌలింగ్ పరంగా కోల్‌కతా పాట్ కమిన్స్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. ఆండ్రీ రసెల్ గత మ్యాచ్ లో ధారాళంగా పరుగులిచ్చేశాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా పెద్దగా రాణించలేదు. అయితే.. యువ పేసర్ ప్రసీద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టి ఫామ్ లోకి రావడంతో కోల్‌కతా టీం ఆనందంలో ఉంది.

ప్లెయింగ్ లెవన్ (అంచనా)

కోల్‌కతా నైట్‌రైడర్స్ : నితీష్ రానా, శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్ (కీపర్), షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.

ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్రిస్ లిన్ / క్వింటన్ డి కాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, మార్కో జాన్సెన్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

Show Full Article
Print Article
Next Story
More Stories