IPL 2021 MI vs KKR: కోల్‌కతా టార్గెట్ 153; బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన ముంబై బ్యాట్స్‌మెన్స్

IPL 2021 MI vs KKR: కోల్‌కతా టార్గెట్ 153; బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన ముంబై బ్యాట్స్‌మెన్స్
x
Highlights

IPL 2021 : ఐపీఎల్ 2021 సీజన్‌లో ఐదో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్న సంగతి తెలిసిందే.

IPL 2021 MI vs KKR: ఐపీఎల్ 2021 సీజన్‌లో ఐదో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం బౌలింగ్ ఎంచుకుంది. ముంబయి ఇండియన్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కోల్‌కతా బౌలర్ల దెబ్బకు ముంబయి టీం 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది.

డికాక్ నిరాశపరిచాడు

బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్స్ రోహిత్, డికాక్ ఆచితూచి ఆడారు. నిలదొక్కునేందుకు మొగ్గుచూపారు. అయినా ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. క్రిస్‌ లిన్‌ బదులు జట్టులోకి వచ్చిన డికాక్‌ను(6 బంతుల్లో 2పరుగులు) వరుణ్‌ చక్రవర్తి పెవిలియన్ కు పంపించాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో డీప్‌ మిడ్‌ వికెట్‌లో ఉన్న రాహుల్‌ త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చి డికాక్ వెనుదిరిగాడు. కెప్టెన్‌ రోహిత్‌కు తోడుగా సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

నత్తనడకలా బ్యాటింగ్

డికాక్‌ వికెట్‌ కోల్పోయిన అనంతరం ముంబై జట్టు ఆటలో పెద్దగా మార్పు రాలేదు. స్పిన్‌ బౌలర్లను పదేపదే ప్రయోగించడంతో ముంబై టీం పరుగులు రాబట్టేందుకు చాలా ఇబ్బంది పడింది. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 37/1 గా ఉందంటే ముంబయి టీం ఎలా బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ తన తీరుకు వ్యతిరేకంగా ఆడడం గమనార్హం.

ఆకట్టుకున్న సూర్య కుమార్

7 ఓవర్ల వరకు నెమ్మదిగా ఆడిన సూర్యకుమార్‌.. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 8వ ఓవర్‌లో బ్యాట్ కి పనిచెప్పాడు. వరుసగా 6,4,4 పరుగులు సాధించి స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో సిక్సర్ తో తన హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ధాటిగా ఆడుతున్న సూర్యకుమార్‌(36 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో పెవిలియనకు చేరాడు. షకీబ్‌ బౌలింగ్‌లో లాంగ్‌ ఆన్‌ ఫీల్డర్‌ శుబ్‌మన్‌ గిల్‌ క్యాచ్‌‌ అందుకోడంతో సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.


ఇషాన్‌ కిషన్‌ విఫలం

సూర్య కుమార్ పెవిలియన్ చేరడంతో బ్యాటింగ్ వచ్చిన ఇషాంత్ కిషన్ ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ లో హుక్‌ షాట్‌ ఆడే క్రమంలో ఫైన్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నప్రసిద్ధ్‌ కృష్ణకు క్యాచ్‌ ఇచ్చి ఇషాంత్ (3 బంతుల్లో 1) పెవిలియన్‌ చేరాడు.

బ్రేక్‌ త్రో ఇచ్చిన కమిన్స్‌; రోహిత్ క్లీన్ బౌల్డ్

కోల్‌కతాకు కమిన్స్‌ మరోసారి బ్రేక్‌త్రో ఇచ్చాడు. ముంబయి కెప్టెన్‌ రోహిత్‌శర్మను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 32బంతులాడిన రోహిత్‌ 3ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 43 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. రెండు ఓవర్లలో 2 వికెట్లు తీసి, ముంబయి ను కోలుకోకుండా చేశాడు కమిన్స్.

మరోసారి విఫలమైన హార్డిక్, పోలార్డ్, పాండ్య

ఆల్ రౌండర్ల స్థానంలో వచ్చిన హార్గిక్, పోలార్డ్ లు కూడా విఫలమయ్యారు. వరుస ఓవర్లలో ఔటై నిరాశపరిచారు. 16.2 ఓవర్లో హార్ధిక్(17 బంతుల్లో 15 పరుగులు) ను ప్రసీద్ పెవిలియన్ పంపగా, 17.2 ఓవర్లో కీరాన్ పోలార్డ్(8 బంతుల్లో 5 పరుగులు) ను రస్సెల్ ఔట్ చేశాడు. అలాగే అదే ఓవర్లో మాక్సో జాన్సన్ కు కూడా రస్సెల్ పెవిలియన్ చేర్చాడు. దీంతో ముంబయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడు వరుస ఓవర్లో మూడు వికెట్లు కోల్సోయింది. ఆతరువాత క్రీజులో నిలబడే వారు లేక ముంబై టీం చేతులేత్తేసింది. 20 ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు కోల్సోయింది. చివరి 5 ఓవర్లలో ముంబై టీం 38 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది.

కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 5 వికెట్లతో సత్తా చాటగా, పాట్ కమిన్స్ 2 వికెట్లు, చక్రవర్తి, షకీబ్, ప్రసీద్ధ్ తలో వికెట్ పడగొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories