KKR vs SRH: బోణీ కొట్టిన కోల్‌కతా.. తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన హైదరాబాద్..!

Kolkata Knight Riders Beat Sunrisers Hyderabad By 4 Runs
x

KKR vs SRH: బోణీ కొట్టిన కోల్‌కతా.. తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన హైదరాబాద్..!

Highlights

KKR vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌పై 4 పరుగుల తేడాతో విజయం

KKR vs SRH: ఉత్కంఠభరితంగా సాగిన తొలిమ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోరాడి ఓడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఆఖరి క్షణంలో పరాజయం పాలైంది. అత్యంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4 పరుగుల తేడాతో నెగ్గింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. ఓపెనర్‌ సాల్ట్‌ 40 బంతుల్లో 54 రన్స్ చేయగా.. చివర్లో రస్సెల్‌ 25 బంతుల్లో 64 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దీంతో కోల్‌కతా భారీ స్కోరు సాధించింది. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ మూడు వికెట్లు పడగొట్టగా, మార్కండే రెండు వికెట్లు తీశాడు.

209 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ తొలి వికెట్‌కు 60 పరుగుల పార్ట్‌నర్‌షిప్ చేయగా.. ఆఖర్లో క్లాసిన్‌ విశ్వరూపం చూపించాడు. 29 బంతుల్లో 63 పరుగులతో పోరాటం చేశాడు. షాబాజ్ అహ్మద్‌ కూడా మెరుపులు మెరిపించడంతో విజయానికి చేరువవగా.. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడంతో కోల్‌కతా విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories