కోహ్లీకి అరుదైన గౌరవం

కోహ్లీకి అరుదైన గౌరవం
x
విరాట్ కోహ్లీ
Highlights

టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. విజ్డన్ ప్రకటించిన దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు కల్పించింది.

టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. విజ్డన్ ప్రకటించిన దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు కల్పించింది. కోహ్లీతో పాటు మరో భారత క్రికెటర్‌ రవిచంద్రన్ అశ్విన్ కు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో చోటు కల్పించింది. విజ్డన్ ప్రకటించిన వన్డే జట్టుకు కోహ్లీనే కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం.

ఈ మేరకు విజ్డన్ ఓ ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటనలో విరాట్ కోహ్లీ ప్రశంసించింది. ఈ పదేళ్లలో ఎప్పటికప్పుడు కోహ్లీ ఎదిగిన తీరు, సవాళ్లను ఎలా స్వీకరించే వైనం అన్ని పేర్కొంది. ఈ పదేళ్లలో కోహ్లీ వన్డే ఫ్మారట్లో కలిపి 5,ఏడు వందల పై చిలుకు పరుగులు చేశాడు. 2014లో నుంచి ఇప్పటి 2019 నవంబర్ లో బంగ్లా పర్యటన వరకూ విరాట్ కోహ్లీ 63 సగటుతో 21 సెంచరీలు, 13 ఆర్థ శతకాలు సాధించడని తెలిపింది.

కోహ్లీ ప్రత్యేకమైన ఆటగాడని చెప్పడానికి ఈ గణాంకాలే అని ప్రకటించింది. ఈ దశాబ్దంలోని క్రికెట్ చరిత్రలో ఆ ఫార్మాట్లలో ఇప్పటి వరకు 50 యవరేజ్ కలిగిన బ్యాట్స్మెన్ కోహ్లీ ఒక్కరే. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత ప్రపంచలో ఓ క్రికెటర్ కెప్టెన్ కోహ్లీ లాగా ఒత్తిడిలో ఆడలేదని విజ్డన్ ప్రకటనలో పేర్కొంది.

టెస్టుల్లో విరాట్ కోహ్లీ 84 టెస్టు్ మ్యాచ్‌ల్లో 141 ఇగ్నింగ్స్ లో కలిపి 27 సెంచరీలు 22 అర్థసెంచరీలుతో 7,202 పరుగులు చేశాడు. 242వన్డేల్లో 43 సెంచరీలు 55 అర్థసెంచరీలతో 11,609 పరుగులు, 75టీ20మ్యాచ్‌ల్లో 2,633 పరుగులు చేశాడు.

విజ్డన్ ప్రకటించిన దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో మరో భారత క్రికెటర్ అశ్విన్ కూడా ఉన్నాడు. అశ్వీన్ 70 టెస్టు మ్యాచ్‌ల్లో 362 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో150 వికెట్లు తీసి అత్యత్తమ ఆటగాళ్ల జాబితాలో చెరాడు. విజ్డన్‌ క్రికెటర్స్‌ ఆల్మానిక్ అంటే ది బైబిల్‌ ఆఫ్‌ క్రికెట్‌గా అభివర్ణింస్తారు. ఇక మూగ్గరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు, ఇద్దరు ఆస్ట్రేలియా, ముగ్గురు దక్షిణాఫ‌్రికా క్రికెటర్లు ఉన్నారు.

విజ్డన్ ప్రకటించిన జాబితాలో క్రికెటర్ల:

విరాట్ కోహ్లీ( భారత్), స్టీవ్ స్మిత్ ( ఆస్ట్రేలియా), డేవిడ్ వార్నర్( ఆస్ట్రేలియా), కుమార సంగక్కర్ల( శ్రీలంక), అలెస్టర్ కుక్ (ఇంగ్లాండ్), జేమ్స్ ఆండర్సన్( ఇంగ్లాండ్) బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), ఏబీ డెవిలియర్స్( దక్షిణాఫ్రికా), రవిచంద్రన్ అశ్విన్( భారత్), డేల్ స్టెయిన్( దక్షిణాఫ్రికా), కగిసో రబాడ( దక్షిణాఫ్రికా)

Show Full Article
Print Article
Next Story
More Stories