Top
logo

పాక్ అభిమాని విన్నపాన్ని విరాట్ మన్నిస్తాడా?

పాక్ అభిమాని విన్నపాన్ని విరాట్ మన్నిస్తాడా?
Highlights

భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే మన దాయాది దేశమైనా పాక్‌లోనూ కోహ్లీని అభిమానించే వారు ఉన్నారు.

భారత్ క్రికెట్ జట్టుకెప్టెన్ విరాట్ కోహ్లీకి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే మన దాయాది దేశమైనా పాక్‌లోనూ కోహ్లీని అభిమానించే వారు ఉన్నారు. అయితే పాక్‌కు చెందినఓ అభిమని ఏకంగా కోహ్లీని తమ దేశంలో ఆడాలని కోరాడు. ఇటీవలె పాకిస్తాన్-శ్రీలంక మధ్య మూడు టీ20లసిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో పాక్ చిత్తుగా ఓడింది. ఖాతా తెరవకుండా మూడు టీ20లను కోల్పోయింది.

ఈ నేపథ్యంలో పాక్‌కు చెందిన ఓ క్రికెట్ ప్రేమికుడు షాహబాజ్ షరీఫ్ ఖాస్మీ ఫ్లకార్డు ప్రదర్శించాడు. అతను చేసిన ట్విట్ క్రికెట్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఆ ట్విట్‌లో అతను విరాట్ దయచేసి పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడాలని తాము కోరుకుంటున్నామని ఆ అభిమాని ఫ్లకార్డు ద్వారా తెలియజేశారు. అయితే దీనికి సంబంధించిన ట్వీట్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఉంచాడు. కాగా.. కోహ్లీ అభిమాని ట్విట్టర్లో పోస్టు చేసిన ఫోటో వైరల్‌గా మారింది. గతంలోను ఫ్లెక్సీని మేధావులు మార్ఫింగ్ చేసి కశ్మీర్‌కి వద్దు కోహ్లీని కోరుకుంటున్నారని చేసిన పోస్టు వైరల్ అయింది.Next Story