లాక్‌డౌన్‌ వేళ.. ఇదే సమయం క్రికెటర్లకు బుకీలు వల..ఎలా అంటే?

లాక్‌డౌన్‌ వేళ.. ఇదే సమయం క్రికెటర్లకు బుకీలు వల..ఎలా అంటే?
x
Representational Image
Highlights

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలైయ్యాయి అంతర్జాయతీయ జాతీయ స్థాయిలో క్రిడా టోర్నీలు వాయిదా పడ్డాయి.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలైయ్యాయి అంతర్జాయతీయ జాతీయ స్థాయిలో క్రిడా టోర్నీలు వాయిదా పడ్డాయి. టీ 20 ప్రపంచ కప్ పై కూడా సందిగ్ధం నెలకొంది. దీంతో క్రికెటర్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆటగాళ్లు సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అయితే ఇదే అదనుగా బుకీలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం క్రికెటర్లను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ బాంబ్ పేల్చారు.

అయితే క్రికెటర్లు గతంలో కంటే ఎక్కువసేపు సోషల్ మీడియాలో ఉంటున్నారని ఈ నేపథ్యంలో బుకీలు సంప్రదిస్తున్నారు. వారితో మాట్లాడటానికి యత్నిస్తున్నారు. భవిష్యత్తులో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు వినియోగించుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌ నిలిచిపోయినా బుకీలు మాత్రం చురుకుగా ఉన్నారని ఐసీసీ తెలిపింది. అయితే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల గురించి ప్లేయర్స్ కు అవగాహన ఉంది అని మార్షల్ అన్నారు. సంక్షోభం నుంచి సాధారణ పరిస్థితులకు చేరుకుని మ్యాచ్‌లు ఎప్పుడు ఆరంభమవుతాయనే దానిపై స్పష్టత లేదని తెలిపారు. .

ఇక దీనిపై బీసీసీఐ అవినీతి నిరోధకశాఖ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ స్పందించారు. టీమిండియా ఆటగాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉంటారని, బుకీలు ఎవరైనా సంప్రదిస్తే భారత్ ఆటగాళ్ళు వెంటనే తమకి తెలియజేయాలని సూచించారు. అభిమానిలా బుకీలు సంభాషణ ప్రారంభించి, అవినీతి గురించి చర్చిస్తారని తెలిపారు. ఇంగ్లాండ్‌ వేల్స్‌ క్రికెట్ బోర్డు అధికారి స్పందిస్తూ.. బుకీల విషయంపై తమ ఆటగాళ్లపై నమ్మకం ఉందని, బుకీల ప్రలోభాలకు లొంగరని పేర్కొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories