ముంబైకి షాక్ ఇచ్చిన పంజాబ్‌

ముంబైకి షాక్ ఇచ్చిన పంజాబ్‌
x
Highlights

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కింగ్స్‌ పంజాబ్‌ షాకిచ్చింది. ముంబైపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 177 పరుగుల...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కింగ్స్‌ పంజాబ్‌ షాకిచ్చింది. ముంబైపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్‌ పంజాబ్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పంజాబ్‌ ఆటగాళ్లలో క్రిస్‌ గేల్‌(40; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) శుభారంభాన్ని ఇవ్వగా మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(71నాటౌట్‌; 57 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌) సూపర్ ఇన్నింగ్స్ తో నాటౌట్ గా నిలిచాడు. వీరికి తోడు మయాంక్‌ అగర్వాల్‌(43; 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుత బ్యాటింగ్ చేయడంతో కింగ్స్‌ పంజాబ్‌ 18.4 ఓవర్‌లోనే 177 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది.

ఇక ముందుగా బ్యాటింగుకు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, డీకాక్‌లు ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించారు. డీకాక్‌(60: 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీకి చేయగా.. రోహిత్‌ శర్మ(32: 19 బంతుల్లో 5 ఫోర్లు) వీరిద్దరూ 5.2 ఓవర్లు ముగిసే సరికి 51 పరుగులు చేసిన తర్వాత రోహిత్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌(11) నిరాశపరచడంతో ముంబై ఇండియన్స్‌ 62 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో డీకాక్‌-యువరాజ్‌ సింగ్ లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

ఈ ఇద్దరు కలిసి 58 పరుగులు అందించారు. ఈ క్రమంలో డీకాక్‌ మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, మరో ఆరు పరుగుల వ్యవధిలో యువీ(18) కూడా ఔటయ్యాడు. ఆ తరువాత మిగిలిన ఆటగాళ్లలో హార్దిక్‌ పాండ్యా(31: 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించడంతో ముంబై 176 పరుగులు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, విల్జోయిన్‌, మురుగన్‌ అశ్విన్‌ తలో రెండు వికెట్లు సాధించగా, ఆండ్రూ టై వికెట్‌ తీశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories