Virat Kohli: సిరాజ్ పోరాట పటిమకు ఫిదా.. ప్రశంసల వర్షం కురిపించిన కోహ్లీ

Virat Kohli: సిరాజ్ పోరాట పటిమకు ఫిదా.. ప్రశంసల వర్షం కురిపించిన కోహ్లీ
x

Virat Kohli: సిరాజ్ పోరాట పటిమకు ఫిదా.. ప్రశంసల వర్షం కురిపించిన కోహ్లీ

Highlights

Virat Kohli: ఇంగ్లాండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓవల్ మైదానంలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

Virat Kohli: ఇంగ్లాండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓవల్ మైదానంలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ విజయం టీమిండియా ఆటగాళ్లనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఉబ్బితబ్బిబ్బ చేసింది. భారత జట్టు పోరాట పటిమను, ఆటతీరును ప్రపంచ క్రికెట్ లోకం ప్రశంసిస్తోంది. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చేరారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన కోహ్లీ, టీమిండియా విజయంపై స్పందించారు. ముఖ్యంగా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను ఆయన ఆకాశానికి ఎత్తేశారు.

ఓవల్ టెస్ట్ చివరి రోజున, భారత జట్టు ఇంగ్లాండ్ మిగిలిన 4 వికెట్లను కూల్చి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ మైదానంలో ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం. సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. ఒక దశలో ఓటమి అంచున ఉన్న టీమిండియా, అద్భుతంగా పుంజుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంలో మహ్మద్ సిరాజ్ పాత్ర చాలా కీలకం. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.

టీమిండియా విజయంపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన X ఖాతా ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు మూడు నెలల క్రితం టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీ, జట్టు పోరాట స్ఫూర్తిని ప్రశంసించారు. ముఖ్యంగా, మహ్మద్ సిరాజ్ ప్రదర్శనపై ప్రత్యేకంగా మాట్లాడారు. "టీమిండియాకు ఇది గొప్ప విజయం. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ పోరాట పటిమ, ధైర్యసాహసాలు ఈ అద్భుతమైన విజయాన్ని అందించాయి. జట్టు కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టిన సిరాజ్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అతని ప్రదర్శన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది" అని కోహ్లీ తన ఎక్స్ పోస్ట్‌లో రాశారు.



విరాట్ కోహ్లీతో పాటు ఐసీసీ అధ్యక్షుడు, మాజీ బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా టీమిండియా విజయంపై అభినందనలు తెలిపారు. ఇంగ్లాండ్ జట్టును కూడా ఆయన ప్రశంసించారు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, జో రూట్‌లను కూడా ఆయన అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories