పొలార్డ్ మృతి, సోషల్ మీడియా ప్రచారం..ఎక్కడ ఉన్నారంటే?

పొలార్డ్ మృతి, సోషల్ మీడియా ప్రచారం..ఎక్కడ ఉన్నారంటే?
x

Pollard

Highlights

వెస్టిండీస్ టీ20 సారథి కీరన్‌ పొలార్డ్ మృతిచెందినట్టు గత రెండు రోజుల క్రితం మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. టీ10 లీగ్‌లో ఆడేందుకు యూఏఈకి...

వెస్టిండీస్ టీ20 సారథి కీరన్‌ పొలార్డ్ మృతిచెందినట్టు గత రెండు రోజుల క్రితం మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. టీ10 లీగ్‌లో ఆడేందుకు యూఏఈకి వచ్చిన పొలార్డ్‌కి కారు ప్రమాదం జరిగిందని.. ఈ ప్రమాదంలో పోలార్డ్ చనిపోయినట్లు కొన్ని సోషల్ మీడియా చానళ్లు ప్రసారం చేశాయి. కరోనా వైరస్ ఆందోళనల కారణంగా పొలార్డ్ ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ పర్యటన నుంచి వైదొలిగాడు. బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఫిబ్రవరి మూడు నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

అయితే పోలార్డ్ మరణవార్తలు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం మాత్రమే.. పోలార్డ్ యూఏలో ఉన్నాడు. శుక్రవారం టీమ్ అబుదాబితో జరిగిన మ్యాచులో పొలార్డ్ 17 బంతుల్లో 24 రన్స్ బాదాడు. ఓ భారీ సిక్సర్ కూడా బాదాడు. ఈ మ్యాచులో గ్లాడియేటర్స్ విజయాన్ని అందుకుంది. గురువారం పూణే డెవిల్స్ జట్టుతో జరిగిన మ్యాచులో కీరన్‌ పొలార్డ్ 6 బంతులు ఎదుర్కొని 2 రన్స్ చేశాడు. ఈ మ్యాచులో డెక్కన్ గ్లాడియేటర్స్ ఓడిపోయింది. అయితే అబుదబి వెళ్లిన పోలార్డ్ కారుకి ప్రమాదం జరిగిందని, ఈయాక్సిడెంట్ లో పోలార్డ్ మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. అంతే కాదు రెండు కార్లు ఢీకొన్న ఫొటో, ఒక డెడ్ బాడీని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న ఫొటోని ఛానళ్లలో చూపించాయి. దీంతో పోలార్డ్ అభిమానులు ఆందోళకు గురయ్యారు.

ముఖ్యంగా ఐపీఎల్‌లో సుదీర్ఘకాలంగా ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఈ ఆడుతున్నాడు. భారత్‌లోనే ఏప్రిల్-మే నెలలో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన అనంతరం ఐపీఎల్ వేదికపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. పొట్టి ఫార్మాట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా గతేడాది కీరన్ పొలార్డ్ రికార్డుల్లోకెక్కాడు. పోలార్డ్ ప్రమాదం అని ప్రచారం రావడంతో ఐపీఎల్ ముంబై ఇండియాన్స్ అభిమానులు కూడా అందోళను గురైయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories