Kho Kho World Cup 2025: ఖో-ఖో టీం కెప్టెన్లకు జీతమెంతో తెలుసా.. షాకవ్వాల్సిందే భయ్యో..!

Kho Kho World Cup 2025 India Mens Womens Captain Pratik Waikar Priyanka Ingle Job Salary Achievement
x

Kho Kho World Cup 2025: ఖో-ఖో టీం కెప్టెన్లకు జీతమెంతో తెలుసా.. షాకవ్వాల్సిందే భయ్యో..!

Highlights

Kho Kho World Cup 2025: ప్రతీక్ వైకర్, ప్రియాంక ఇంగ్లే అనే ఈ రెండు పేర్లు ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్నాయి.

Kho Kho World Cup 2025: ప్రతీక్ వైకర్, ప్రియాంక ఇంగ్లే అనే ఈ రెండు పేర్లు ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్నాయి. భారతదేశాన్ని ఖో ఖోలో ప్రపంచ ఛాంపియన్‌గా మార్చే బాధ్యత ప్రస్తుతం వారిద్దరి భుజాలపై ఉంది. జనవరి 13 నుండి భారతదేశంలో పురుషులు, మహిళల ఖో ఖో ప్రపంచ కప్ ఆడుతున్నారు. భారత మహిళల ఖో-ఖో జట్టు కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే. ప్రతీక్ వైకర్ భారత పురుషుల ఖో-ఖో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఖో ఖో ప్రపంచ కప్ నుండి వారిద్దరూ ఖచ్చితంగా పెద్దమొత్తాన్నే సంపాదిస్తారు. కానీ ఈ ఆట కాకుండా భారత కెప్టెన్లు ఇద్దరూ ఏమి చేస్తారో తెలుసా? వారి జీతం ఎంత? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారత మహిళల ఖో-ఖో జట్టుకు నాయకత్వం వహిస్తున్న ప్రియాంక ఇంగ్లే మహారాష్ట్రకు చెందినవారు. ఆమె 2023లో 4వ ఆసియా ఖో-ఖో ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అంతకుముందు 2022లో ఆమె జాతీయ స్థాయిలో రాణి లక్ష్మీ బాయి అవార్డును కూడా గెలుచుకుంది. ఆమె తన 15 ఏళ్ల ఖో-ఖో కెరీర్‌లో 23 జాతీయ పోటీల్లో పాల్గొంది. ప్రియాంక ఇంగ్లే ఖో ఖో ఆడటమే కాకుండా నృత్యం కూడా చేస్తుంది. తను బిజినెస్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఇప్పుడు ఆమె ముంబైలోని ఆదాయపు పన్ను విభాగంలో టాక్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ పోస్టుకు ప్రతి నెలా రూ. 25500 నుండి రూ. 81,000 వరకు జీతం ఇస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రియాంకకు క్రీడా విభాగంలో గ్రేడ్ 2 స్థాయి ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది.

ప్రతీక్ కి స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం

భారత ఖో ఖో జట్టు కెప్టెన్ ప్రతీక్ వైకర్ కు ఖో ఖోతో ప్రత్యేకమైన సంబంధం ఉంది. అతను కేవలం ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ ఆటపై ఆసక్తి చూపించాడు. తన చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించిన తర్వాత అతను ఖో ఖో ఆడటం ప్రారంభించాడు. అల్టిమేట్ ఖో-ఖో లీగ్‌లో తెలుగు వారియర్స్‌కు ప్రతీక్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 56వ సీనియర్ నేషనల్ ఖో ఖో ఛాంపియన్‌షిప్‌లో మహారాష్ట్రకు బంగారు పతకం అందించడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. భారత పురుషుల ఖో-ఖో జట్టు కెప్టెన్ ప్రతీక్ ఉన్నతను అభ్యసించాడు. అతనికి ఒకటి కాదు రెండు డిగ్రీలు ఉన్నాయి. ఫైనాన్స్‌లో డిగ్రీతో పాటు, ఆయనకు కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ కూడా ఉంది. ఇది మాత్రమే కాదు, అతనికి స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం కూడా వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories