DC vs MI: బుమ్రానే వణికించాడు..కరుణ్ నాయర్..బుమ్రా మధ్య గొడవ వీడియో వైరల్


DC vs MI: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాటిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచులో ఇంట్రెస్టింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో...
DC vs MI: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాటిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచులో ఇంట్రెస్టింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో ముంబై ఇండియనస్ స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఇద్దరూ గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే..
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగాడు. ఔటాఫ్ సిలబస్ గా బరిలోకి దిగి ముంబై ఇండియన్స్ బౌలర్లను చితక్కొట్టాడు. వరల్డ్ బేస్డ్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లోనూ అలవోకగా సిక్సర్లు బాదాడు. బుమ్రా వేసిన 4వ ఓవర్ లో రెండు బౌండరీలతో 11 పరుగులు పిండుకున్న కరుణ్ నాయర్..అతను వేసిన 6వ ఓవర్ లో రెండు సిక్సులు, రెండు ఫోర్లతో 18 పరుగులు చేసి 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
7ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో అర్థశతకం నమోదు చేశాడు. అయితే ఈ ఓవర్ లో రన్ తీసే క్రమంలో కరుణ్ నాయర్ చూసుకోకుండా బుమ్రాను ఢీకొట్టాడు. వెంటనే క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ బౌండరీలు బాదడనే ఫ్రస్టేషన్ లో కరుణ్ నాయర్ పై బుమ్రా నోరు పారేసుకున్నాడు. ఈ ఎక్స్ ట్రాలే వద్దు అని వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది. దాంతో ఆగ్రహానికి లోనైన కరుణ్ నాయర్ ధీటుగా బదులివ్వడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అంపైర్ జోక్యం చేసుకుని బుమ్రాకు సర్ధి చెప్పాడు. కరుణ్ నాయర్ తన తప్పులేదని హార్థిక్ పాండ్యాకు వివరణ కూడా ఇచ్చాడు. ఈ గొడవ మధ్యలో రోహిత్ శర్మ ఫన్నీ రియాక్షన్స్ నవ్వులు పూయించాయి.
The average Delhi vs Mumbai debate in comments section 🫣
— Star Sports (@StarSportsIndia) April 13, 2025
Don't miss @ImRo45 's reaction at the end 😁
Watch the LIVE action ➡ https://t.co/QAuja88phU#IPLonJioStar 👉 #DCvMI | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/FPt0XeYaqS

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



