క్రికెటర్లందరూ కుక్కల్లా.. రోహిత్ శర్మ ట్వీట్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

క్రికెటర్లందరూ కుక్కల్లా.. రోహిత్ శర్మ ట్వీట్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
x

రోహిత్ శర్మ కంగనా రనౌత్ ఫైల్ ఫోటో 

Highlights

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతుల పోరాటం సామాజిక యుద్ధానిక తెరలేపిందా..? ఇంటా బయటా వస్తున్న విమర్శలతో కేంద్రం ఎదురు దాడి ప్రారంభించిందా.....

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతుల పోరాటం సామాజిక యుద్ధానిక తెరలేపిందా..? ఇంటా బయటా వస్తున్న విమర్శలతో కేంద్రం ఎదురు దాడి ప్రారంభించిందా.. అంటే అవుననే చెప్పాలి. పాప్ సింగర్ రిహానా ట్వీట్‌తో మొదలైన సోషల్ మీడియా వార్.. గ్రెటా థన్‌బర్గ రంగంలోకి దిగడంతో మరింత ముదిరింది. టీమిండియా క్రికెటర్లు సచిన్‌, కోహ్లి సహా పలువురు రైతు ఉద్యమంపై సామాజిక మాద్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

తాజాగా టీమిండియా ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సైతం రైతుల ఆందోళనపై ట్వీట్ చేశాడు. 'ప్రజలందరూ ఐకమత్యంగా ఉన్నప్పుడే భారత్ బలంగా ఉంటుంది. రైతుల సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన తరుణం ఇది. దేశ అభివృద్ధిలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కలిసికట్టుగా పరిష్కారం కనుగొనడంలో ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను పోషిస్తారని ఆశిస్తున్నా. ఐక్య భారత్' అని ట్వీట్ చేశాడు రోహిత్.

రోహిత్‌ చేసిన ట్వీట్‌పై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఈ క్రికెటర్లందరూ దోబీ దగ్గర కుక్కల్లా ఎందుకు మొరుగుతున్నారు. అటు ఇంటికి కాకుండా.. ఇటు ఘాట్‌కు కాకుండా అంటూ' విమర్శిస్తూ ట్విట్ చేశారు. రైతు సంక్షేమం ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక చట్టాలకు రైతులే ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? అని' కంగనా రనౌత్ ప్రశ్నించారు. కంగనా చేసిన ట్వీట్ పై నెటిజన్లు, రోహిత్ శర్మ అభిమాను తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. కంగనా హద్దులు దాటి మాట్లాడతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కంగనా వెంటనే ఆ ట్విట్ తొలిగించింది. ఒక రైతులను ఉగ్రవాదులంటూ కంగనా ట్విట్ చేసిన విషయం తెలిసిందే.

ఓ రకంగా మున్నెన్నడూ లేని విధంగా వేలకొద్దీ అనుకూల, ప్రతికూల పోస్టులతో ట్విటర్‌ హోరెత్తిపోతోంది. అటు మంత్రులకు మద్ధుతుగా ఇండియన్ సెలబ్రిటీలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories