Bumrah: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. ఎంత పని చేశావ్‌ బుమ్రా!

Bumrah
x

Bumrah: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. ఎంత పని చేశావ్‌ బుమ్రా!

Highlights

Bumrah: వెన్నుపోటు సమస్యతో బాధపడుతున్న బుమ్రా ఐపీఎల్‌కు ఆలస్యంగా చేరే అవకాశమే ఉంది. బీసీసీఐ పూర్తిగా ఫిట్ అయితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తామని తెలిపింది.

Bumrah: ఐపీఎల్ 2025లో విజయం రుచి చూశాక ముంబై ఇండియన్స్ కు తలనొప్పి వార్త వచ్చింది. జట్టుకు కీలకమైన బౌలర్ బుమ్రా ఎంట్రీ మరింత ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు కోల్పోయిన తర్వాత ముంబై విజయం సాధించినా, ఇప్పుడు బుమ్రా లేకపోవడం మరో సవాలుగా మారింది.

వెన్నుపోటు సమస్యతో బాధపడుతున్న బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాస ప్రక్రియలో ఉన్నాడు. అక్కడ బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటికీ, పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్ బుమ్రా శారీరక స్థితిని నిత్యం పరిశీలిస్తోంది. ప్రాక్టీస్ సమయంలో మళ్లీ గాయం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. దాంతో, బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు వారాల సమయం అవసరం అవుతుందని అంచనా.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చెలరేగిన బుమ్రా చివరి టెస్ట్ లో గాయపడి మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో పాటు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి కూడా అతను తప్పుకోవాల్సి వచ్చింది. బుమ్రా గాయం పునరావాసానికి ప్రాధాన్యత ఇచ్చిన బీసీసీఐ, అతను పూర్తిగా కోలిన తరువాత మాత్రమే ఐపీఎల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. లేకపోతే ఈ సీజన్ మొత్తాన్ని అతను పక్కనుంచాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే, మొదటి రెండు పరాజయాల తర్వాత కోల్‌కతాపై గెలుపుతో పుంజుకుంది. అశ్వని కుమార్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ముంబై తన తదుపరి మ్యాచ్‌ను లక్నోతో శుక్రవారం ఆడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories