
ఆస్టేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో క్రికెటర్లు ఫిల్డింగ్ స్టంట్స్ తో అదరగొడుతున్నారు. ఆఫ్గాన్ స్పిన్నర్ అహ్మద్ వినూత్న సంబరాలతో అదగొట్టిని...
ఆస్టేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో క్రికెటర్లు ఫిల్డింగ్ స్టంట్స్ తో అదరగొడుతున్నారు. ఆఫ్గాన్ స్పిన్నర్ అహ్మద్ వినూత్న సంబరాలతో అదగొట్టిని సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ జోర్డాన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో హాట్‌టాపిక్‌గా మారాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో ఐసీసీ, బీబీఎల్ ట్విటర్ లో పోస్టు చేశాయి. బిగ్‌బాష్‌లీగ్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా రెనిగేడ్స్, పెర్త్ స్కాచర్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రిస్ జోర్డాన్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు.
ఈ మ్యాచ్ లో పెర్త్ స్కార్చర్స్ జట్టు తరపున క్రిస్ జోర్డాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు ఆటగాడు బౌలర్ ఫవాద్ అహ్మద్ వేసిన 18వ ఓవర్లో క్రిస్టియన్ భారీ షాట్ ఆడాడు. లాంగాన్ మీద ఫీల్డింగ్ చేస్తున్న జోర్దాన్ డైవ్ చేసి క్యాచ్ పట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో క్రిస్టియాన్ డకౌట్ అయ్యాడు. జోర్దాన్ డైవ్ క్యాచ్ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారంతా జోర్దాన్ డైవ్ క్యాచ్ ను ప్రసంశలతో ముంచెత్తున్నారు. ఐపీఎల్ -2020 వేలంలో క్రిస్ జోర్డాన్‌ను పంజాబ్ ఫ్రాంచైజీ రూ. 3 కోట్లకు వేలంలో దక్కించుకుంది.
Chris Jordan, just wow! 🤯 pic.twitter.com/yVH67BZpdq
— ICC (@ICC) December 21, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




