Joe Root : జో రూట్ సెంచరీల హ్యాట్రిక్.. సంగక్కరను దాటి ఏకంగా 13 రికార్డులు

Joe Root : జో రూట్ సెంచరీల హ్యాట్రిక్.. సంగక్కరను దాటి ఏకంగా 13 రికార్డులు
x
Highlights

Joe Root : ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ మరోసారి టీమిండియాపై చెలరేగిపోయాడు. లార్డ్స్, మ్యాన్చెస్టర్‌లో సెంచరీలు చేసిన తర్వాత, ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఒక అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు.

Joe Root : ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ మరోసారి టీమిండియాపై చెలరేగిపోయాడు. లార్డ్స్, మ్యాన్చెస్టర్‌లో సెంచరీలు చేసిన తర్వాత, ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఒక అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. కేవలం 137 బంతుల్లో 12 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒక దశలో ఓవల్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో ఉన్నట్లు కనిపించినప్పటికీ, జో రూట్, హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఈ సెంచరీతో రూట్ టెస్ట్ కెరీర్‌లో 39వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇది అతనికి మూడో సెంచరీ కావడం విశేషం.

టెస్ట్ క్రికెట్‌లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా జో రూట్ నిలిచాడు. ఇండియాపై ఇది అతనికి 13వ సెంచరీ. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 11 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో రూట్ ఇప్పటికే లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 104 పరుగులు, మ్యాన్చెస్టర్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇప్పుడు ఓవల్‌లో కూడా సెంచరీతో దూసుకుపోయాడు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ 754 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.

ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ ఒక గొప్ప రికార్డును అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‎లో 6000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనతను అతను 69వ మ్యాచ్‌లో సాధించాడు. 53.27 సగటుతో 21 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో రూట్ అగ్రస్థానంలో నిలిచాడు.

డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ల జాబితా:

జో రూట్: 69 మ్యాచ్‌లలో 6000+ పరుగులు (21 సెంచరీలు, 22 అర్ధసెంచరీలు)

స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా): 55 మ్యాచ్‌లలో 4278 పరుగులు (13 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు)

మార్నస్ లాబుషేన్ (ఆస్ట్రేలియా): 53 మ్యాచ్‌లలో 4225 పరుగులు (11 సెంచరీలు, 22 అర్ధసెంచరీలు)

ఈ జాబితాలో టాప్-10లో ఏ భారతీయ బ్యాట్స్‌మెన్ కూడా లేకపోవడం గమనార్హం. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 11వ స్థానంలో ఉన్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో జో రూట్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తన టెస్ట్ కెరీర్‌లో 158 మ్యాచ్‌ల 288 ఇన్నింగ్స్‌లలో 39 సెంచరీలు చేశాడు. దీంతో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కుమార్ సంగక్కరను (38 సెంచరీలు) రూట్ అధిగమించాడు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ల జాబితా

సచిన్ టెండూల్కర్ (భారత్): 51 సెంచరీలు

జాక్వెస్ కల్లిస్ (సౌత్ ఆఫ్రికా): 45 సెంచరీలు

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా): 41 సెంచరీలు

జో రూట్ (ఇంగ్లాండ్): 39 సెంచరీలు

Show Full Article
Print Article
Next Story
More Stories