Jemimah Rodrigues : వరల్డ్ కప్ ఫైనల్‎కు టీమిండియా.. జేమిమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ వెనుక ఇంత కథ ఉందా ?

Jemimah Rodrigues : వరల్డ్ కప్ ఫైనల్‎కు టీమిండియా.. జేమిమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ వెనుక ఇంత కథ ఉందా ?
x

Jemimah Rodrigues : వరల్డ్ కప్ ఫైనల్‎కు టీమిండియా.. జేమిమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ వెనుక ఇంత కథ ఉందా ?

Highlights

భారత మహిళా క్రికెట్ జట్టు గురువారం డీవై పాటిల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై రికార్డు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

Jemimah Rodrigues : భారత మహిళా క్రికెట్ జట్టు గురువారం డీవై పాటిల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై రికార్డు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. భారత జట్టు విజయంలో జేమిమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించారు. జేమిమా తన సెంచరీ ఇన్నింగ్స్‌తో భారత్ ఫైనల్‌కు చేర్చారు. జేమిమాకు ఆమె అజేయమైన సెంచరీ ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మ్యాచ్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎంపికైన తర్వాత జేమిమా మాట్లాడుతూ.. "ముందుగా నేను యేసుక్రీస్తుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇదంతా ఒంటరిగా చేయలేను. ఈ కష్ట కాలంలో ఆయన నన్ను బయటపడేశాడని నాకు తెలుసు. నా తల్లిదండ్రులకు, కోచ్‌లకు, ఈ సమయంలో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. గత నాలుగు నెలలు నిజంగా చాలా కష్టంగా గడిచాయి, కానీ ఇది ఒక కలలా అనిపిస్తుంది. ఇంకా పూర్తిగా నిజం కాలేదు" అని అన్నారు.

ఆస్ట్రేలియా భారత్‌కు 339 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 59 పరుగులకే మంధాన, షఫాలీ వికెట్లను కోల్పోయి భారత జట్టు కష్టాల్లో పడింది. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జేమిమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 14 ఫోర్ల సహాయంతో అజేయంగా 127 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

జేమిమాకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. హర్మన్ 88 బంతుల్లో 89 పరుగులు చేసి, మూడో వికెట్‌కు జేమిమాతో కలిసి 167 పరుగుల మ్యాచ్-విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీప్తి శర్మ 24, రిచా ఘోష్ 26, అమన్‌జోత్ కౌర్ అజేయంగా 15 పరుగులు చేశారు. షఫాలీ 10, మంధాన 24 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలుచుకుంది. ఇంతకుముందు మహిళా వన్డే క్రికెట్‌లో 331 పరుగులే అత్యధిక లక్ష్య ఛేదన. 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత జట్టు కొత్త రికార్డును నెలకొల్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories