మహీభాయ్‌ ధన్యవాదాలు‌.. మా గ్యాంగ్‌కు మరిచిపోలేని ట్రిప్

మహీభాయ్‌ ధన్యవాదాలు‌.. మా గ్యాంగ్‌కు మరిచిపోలేని ట్రిప్
x
మహేంద్ర సింగ్ ధోని, జైసీ గిల్, సాక్షి ధోని
Highlights

ప్రముఖ పంజాబీ గాయకుడు జస్దీప్ సింగ్ గిల్. ఈ గాయకుడికి భారత జట్టు మాజీ సారథి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబంతో మంచి అనుబంధం ఉంది.

ప్రముఖ పంజాబీ గాయకుడు జస్దీప్ సింగ్ గిల్. ఈ గాయకుడికి భారత జట్టు మాజీ సారథి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. తాజాగా జైసీ గిల్ ధోనిపై ప్రసంశల వర్షం కురిపించారు. ధోని కుటుంబంతో కలిసి దిగిన కొన్ని ఫోటోలకు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాకుండా ధోని కుటుంబం ఇచ్చిన ఆతిధ్యంపై ధన్యవాదాలు తెలిపారు.

జైసీ గిల్ విడుదల చేసిన ఫోటోల్లో ధోనితోపాటు అతని సతీమణి సాక్షి ధోనికూడా ఉన్నారు. గిల్ ట్విటర్ లో షేర్ చేస్తూ.. కామెంట్ కూడా పెట్టారు. మహీ భాయ్- సాక్షిజీ మీరు ఇచ్చిన ఆతిథ్యానికి నా ధన్యవాదాలు, మీతో కుటుంబతో కలిసి గడిపిన క్షణాలు మరిపోలేము అంటూ ట్విట్ చేశారు.

జైసీ గిల్ తన గానంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 31వ వసంతంలోకి అడుగుపెట్టిన గిల్ తన పుట్టిన రోజు ఫోటోలను ఫ్యాన్స్ లో పంచుకున్నారు. అందులో ధోని భార్య కూడా ఉన్నారు. కాగా, ఇప్పుడు ఆ ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

కాగా.. టీమిండియా మాజీ సారధి ధోనీ ఈ సంవత్సరం జులై తర్వాత మ్యాచ్ ఆడలేదు. ప్రపంచ కప్ లో నూజిలాండ్ లో నిర్వహించిన మ్యాచ్ చివరి మ్యాచ్. ఆ తర్వాత భారత ఆర్మీలోని పారాచూట్‌ రెజిమెంట్‌లో కొన్ని రోజులు టైనింగ్ తీసుకున్నారు. ఆతర్వాత కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. చాలా రోజులుగా ధోని భవితవ్యంపై ప్రతిష్టంభన నెలకొని ఉంది. కాగా.. టీమిండియా క్రికెట్ పునరాగమనం గురించి మీడియా అడిన ప్రశ్నలకు ధోని స్పందించారు.

ఈ మిషయమై 2020 జనవరి వరకూ ఏమీ ప్రశ్నించవద్దని కోరారు. దీంతో ధోని క్రికెట్‌కు విశ్రాంతి ప్రకటింస్తారా? లేక తిరిగి జట్టులోకి వస్తారా అనే సందిగ్థత ఇంకా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ధోని, అతని సతీమణి సాక్షిధోని ఇద్దరూ చిక్కుల్లో పడ్డారు. ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు వ్యాపారంలో ఫ్లాట్లు ఇస్తామని మోసం చేశారని పలువురు ఫిర్యాదు చేశారు.

టీమిండియా క్రికెటర్ ధోని భార్య సాక్షి ధోనికి కంపెనీ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌‌కు ధోని ప్రచారకర్తగా వ్యవహరించారు. ఆ సంస్థ పలు ప్లాట్లు అమ్ముతామని బాధితుల వద్ద సోమ్మును సేకరించి దానిని నిబంధలను వ్యతిరేకంగా ఇతర కంపెనీల్లో ఇన్వేస్ట్ చేసింది. ధోని బ్రాండ​అంబాసిడర్‌గా ఉండదంతోనే అతనిపై ఎఫ్‌ఐఆర్‌లు చేశారు. ‎ఫాట్లు కొనుగోలు చేసిన బాధితులు పలువురు చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు 7ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories