CSK vs RCB : లైవ్ మ్యాచ్‌లో రచ్చ! అంపైర్‌పై ఫైర్ అయిన జడేజా!

jadeja Confronts Umpire in Heated Exchange During Live RCB vs CSK Clash!
x

CSK vs RCB : లైవ్ మ్యాచ్‌లో రచ్చ! అంపైర్‌పై ఫైర్ అయిన జడేజా!

Highlights

CSK vs RCB : ఐపీఎల్ 2025లో 52వ మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ వేగంగా పరుగులు సాధిస్తోంది. ఓపెనర్ ఆయుష్ మాత్రే అద్భుతమైన...

CSK vs RCB : ఐపీఎల్ 2025లో 52వ మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ వేగంగా పరుగులు సాధిస్తోంది. ఓపెనర్ ఆయుష్ మాత్రే అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లందరినీ చితక్కొడుతూ రవీంద్ర జడేజాతో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే అతను అవుటైన తర్వాత మైదానంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ లుంగి ఎన్‌గిడి వేసిన ఓవర్‌లో అంపైర్ ఒక వివాదాస్పదమైన నిర్ణయం ఇవ్వడంతో చెన్నై ఆల్‌రౌండర్ జడేజా అతనితో వాగ్వాదానికి దిగాడు. దాంతో మైదానం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఈ ఒక్క నిర్ణయంతో చెన్నై విజయం దూరమైంది. గత 24 గంటల్లో లైవ్ మ్యాచ్‌లో ఆటగాడు అంపైర్‌తో గొడవపడటం ఇది రెండోసారి. మే 2న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా అంపైర్‌తో లైవ్ మ్యాచ్‌లో వాగ్వాదానికి దిగాడు.

అసలు ఏం జరిగిందంటే, చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో 17వ ఓవర్‌ను ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ లుంగి ఎన్‌గిడి వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతికి అద్భుతంగా ఆడుతున్న ఆయుష్ అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు బ్రెవిస్ వచ్చాడు. ఓవర్‌లోని మూడో బంతిని ఎన్‌గిడి ఫుల్ టాస్‌గా విసిరాడు. బ్రెవిస్ దాన్ని లైన్ మీదుగా కొట్టడానికి ప్రయత్నించగా పూర్తిగా మిస్సయ్యాడు. అంపైర్ వెంటనే అతన్ని అవుట్ ప్రకటించాడు. బ్రెవిస్ రివ్యూ తీసుకోవాలనుకున్నప్పటికీ అప్పటికే సమయం దాటిపోయింది. ఈ నిర్ణయంతో రవీంద్ర జడేజా అసహనం వ్యక్తం చేశాడు. దీంతో అతను అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఓవర్‌లో ఎన్‌గిడి వరుసగా రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ బెంగళూరు వైపు తిరిగింది.

బ్రెవిస్ వేగంగా పరుగులు తీయగల ఆటగాడు. కానీ అతను అవుటవ్వడంతో చెన్నై చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా జారిపోయింది. ఈ వివాదాస్పదమైన నిర్ణయం సీఎస్‌కే గెలిచే మ్యాచ్‌ను ఓటమిగా మార్చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకుముందు ఆర్సీబీ చెన్నై సొంతగడ్డపైనే సీఎస్‌కేను ఓడించింది. చెన్నై 11 మ్యాచ్‌ల్లో ఇది 9వ ఓటమి. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. అయితే 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో ఆర్సీబీ అగ్రస్థానానికి చేరుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం దాదాపు ఖాయమైపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories