Team India Cricketers: టీమిండియా నుంచి ముగ్గురు ఔట్.. రిటైర్మెంట్ చేసేందుకు సిద్ధం.. కారణం ఏంటంటే?

Team India Cricketers
x

Team India Cricketers

Highlights

Team India Cricketers: టీమ్ ఇండియాలో ముగ్గురు బలమైన ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లంతా బలవంతంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి త్వరలో రిటైర్ కావచ్చు. ఈ ముగ్గురు ఆటగాళ్ల కార్డులను టీమ్ ఇండియా నుంచి బీసీసీఐ తొలగించింది.

Team India Cricketers: టీమ్ ఇండియాలో ముగ్గురు బలమైన ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లంతా బలవంతంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి త్వరలో రిటైర్ కావచ్చు. ఈ ముగ్గురు ఆటగాళ్ల కార్డులను టీమ్ ఇండియా నుంచి బీసీసీఐ తొలగించింది. ఈ ముగ్గురు భారతీయ ఆటగాళ్ల అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసిట్లే. భారత జట్టు తలుపులు కూడా వారికి మూసివేసినట్లు కనిపిస్తున్నాయి. కానీ, వీరు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. భారత క్రికెట్ జట్టులో ఎంపిక కావడం వీరికి ఎంత కష్టమో, ఒకవేళ ఎంపికైనా టీమిండియాలో స్థానం అలాగే కాపాడుకోవడం కూడా కష్టమే. వాళ్లు ముగ్గురు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. ఇషాంత్ శర్మ
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసింది. ఇషాంత్ శర్మ చివరిసారిగా నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో కనిపించాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో కాన్పూర్ టెస్ట్ ఆడిన తర్వాత, ఇషాంత్ శర్మకు మళ్లీ టీమ్ ఇండియాకు ఆడే అవకాశం ఇవ్వలేదు. టీమ్ ఇండియాలో పోటీ నిరంతరం పెరుగుతోంది. షమీ, బుమ్రా, సిరాజ్ లాంటి బౌలర్లు టెస్టు ఫార్మాట్‌లో రాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా నుంచి ఇషాంత్ శర్మ కార్డు కట్ అయింది. ఇషాంత్ శర్మ 100కి పైగా టెస్టులు ఆడాడు. అందులో అతను తన పేరిట 311 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ శర్మ ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఆటగాడికి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ మాత్రమే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

2. వృద్ధిమాన్ సాహా
వృద్ధిమాన్ సాహా చాలా మంచి వికెట్ కీపర్. అయితే అతనికి టెస్టు క్రికెట్‌లో ఆడే అవకాశం రాలేదు. సాహా 2010లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి సాహా కేవలం 40 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. 40 ఏళ్ల వృద్ధిమాన్ సాహాకు సంబంధించి, భారత జట్టు మేనేజ్‌మెంట్ సెలెక్టర్లకు వారి భవిష్యత్తు ప్రణాళికలలో లేడని తెలిపింది. 2022లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతనికి తలుపులు మూసేశారు. ఇప్పుడు మళ్లీ టెస్టు జట్టులోకి పునరాగమనం చేయగలడన్న ఈ ఆటగాడి ఆశలు దాదాపుగా ముగిశాయి. సాహా టెస్ట్ కెరీర్ గురించి మాట్లాడుతూ, అతను 40 టెస్టుల్లో 29.41 సగటుతో 1353 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు కనిపించాయి.

3. కరుణ్ నాయర్
చెన్నైలో ఇంగ్లండ్‌పై కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీ చేసినపుడు కరుణ్‌ నాయర్‌ లాంగ్‌ హార్స్‌ అని అనిపించినా.. రియాల్టీలో మాత్రం అలా కనిపించలేదు. ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత, అతను రాణించలేకపోయాడు. అందుకే, అతను జట్టు నుంచి తొలగించారు. కరుణ్ నాయర్ నవంబర్ 2016లో ఇంగ్లండ్‌పై తన అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను చివరిసారిగా మార్చి 2017లో ఆస్ట్రేలియాతో ఆడాడు. అతను తన కెరీర్‌లో కేవలం 6 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 62.33 సగటుతో 374 పరుగులు చేశాడు. టెస్టులో అతని అత్యధిక స్కోరు 303 పరుగులు.

Show Full Article
Print Article
Next Story
More Stories