టీంఇండియాకి గుడ్ న్యూస్ .. మళ్ళీ టీం లోకి ఇషాంత్..

టీంఇండియాకి గుడ్ న్యూస్ .. మళ్ళీ టీం లోకి ఇషాంత్..
x
Highlights

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీంఇండియా జట్టు ఆతిధ్య జట్టును టీ20లో క్లీన్ స్వీప్ చేసి అదే జట్టుతో మూడు వ‌న్డేల్లో ఓడిపోయి వైట్‌వాష్‌కు గురైంది....

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీంఇండియా జట్టు ఆతిధ్య జట్టును టీ20లో క్లీన్ స్వీప్ చేసి అదే జట్టుతో మూడు వ‌న్డేల్లో ఓడిపోయి వైట్‌వాష్‌కు గురైంది. ఇక ఆ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కి భారత్ సిద్దం అవుతుంది. ఈ నేపధ్యంలో భార‌త జ‌ట్టుకు ఊర‌ట ల‌భించింది. భారత పేస‌ర్ ఇషాంత్ శ‌ర్మ ఫిట్‌నెస్ టెస్టులో నెగ్గి జట్టులోకి వచ్చాడు. ఫిబ్రవరి21 నుంచి కివీస్‌తో మొదలయ్యే తొలిటెస్టుకు ఇషాంత్ అందుబాటులో ఉండనున్నాడు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఇషాంత్ శ‌ర్మ గాయ‌ప‌డ్డాడు. ఇందులో చీల‌మండ గాయానికి ఇషాంత్ శర్మ గుర‌య్యాడు. గాయం నుంచి కోలుకొని మళ్ళీ ఫిట్‌నెస్ సాధించి ఇషాంత్ జట్టులోకి రావడం శుభపరిణామం అని స్పోర్ట్స్ ఎనలిస్ట్ లు అంటున్నారు. ఇషాంత్ రాకతో జట్టులో బలం పెరుగుతుందని అంటున్నారు. యువ పేస‌ర్లు జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మద్ ష‌మీల‌కు ఇషాంత్ చెప్పే సూచనలు ఎంతో ఉపయోగపడుతాయని అంటున్నారు.

గత ఏడాది బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఇషాంత్ శర్మ ఆడాడు. ఆ సిరీస్ లో ఇషాంత్ ఏకాంగా 12 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో కూడా ఇషాంత్ మళ్ళీ సత్తా చాటుతాడని జట్టు ఆశిస్తోంది. న్యూజిలాండ్ జట్టుతో మొదటి టెస్ట్ ముందు భారత్ న్యూజిలాండ్ లెవ‌న్ జ‌ట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను హామిల్టన్‌లో ఆడుతోంది. ఆ తర్వాత ఫిబ్రవరి21 నుంచి మొదటి టెస్ట్ మొదలవుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories