SRH 11 crore player: ఈ 11 కోట్ల ప్లేయర్‌ను ఆడిస్తారా? సన్‌రైజర్స్‌ తుదిజట్టుపై వీడని సస్పెన్స్!

SRH 11 crore player
x

SRH 11 crore player: ఈ 11 కోట్ల ప్లేయర్‌ను ఆడిస్తారా? సన్‌రైజర్స్‌ తుదిజట్టుపై వీడని సస్పెన్స్!

Highlights

SRH 11 crore player: SRH మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అతడిని ప్లేయంగ్‌-11లోకి తీసుకుంటారా?

SRH 11 crore player: గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఎవ్వరూ ఊహించని విధంగా పాట్ కమిన్స్ సారథ్యంలో అదరగొట్టింది. చివరికి కప్ గెలుచుకోలేకపోయినా, వాళ్ల ఆట చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. ఇప్పుడు అదే ఊపును కొనసాగిస్తూ, మరింత బలంగా తిరిగి రావాలని SRH మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. కావ్య మారన్ సారథ్యంలోని టీమ్, ఈ సీజన్‌లో మరింత దూకుడుగా ఆడేందుకు సిద్ధమవుతోంది.

మెగా ఆక్షన్‌లో SRH అద్భుతమైన స్క్వాడ్‌ను రూపొందించింది. ఇప్పటికే జట్టులో ఉన్న అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాస్సేన్‌లతో పాటు, ముంబై ఇండియన్స్ వదిలేసిన ఇషాన్ కిషన్‌ను ఏకంగా 11 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది. ఇషాన్ వికెట్-కీపర్ బ్యాట్స్‌మన్. కానీ టీమ్‌లో ఇప్పటికే క్లాస్సేన్ అదే రోల్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒకవేళ ఇషాన్‌ను ప్లేయింగ్ 11లోకి తీసుకుంటే, జట్టు కేవలం ఐదు బౌలర్లతో బరిలోకి దిగాల్సి వస్తుంది. ఇది టీమ్ బ్యాలెన్స్‌ను పూర్తిగా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. ఉప్పల్ స్టేడియం లాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్‌లలో ఇషాన్ జట్టులో ఉన్నా, లేకపోయినా పెద్దగా సమస్య కాదు. కానీ అవే మ్యాచులు మాత్రం SRH ప్లేఆఫ్ అవకాశాల్ని నిర్ణయిస్తాయి. బయటి గ్రౌండ్లలో పిచ్ కండిషన్లను బట్టి టీమ్ బౌలింగ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇలాంటి సమయంలో ఇషాన్ కిషన్ లాంటి ఒక్క పరిమితి గల బ్యాట్స్‌మన్‌కు స్థానం ఇవ్వడం రిస్క్ అనే భావన ఫాన్స్‌లో ఉంది.

SRH అతడిపై 11 కోట్లు పెట్టినందున, అతనికి తప్పకుండా అవకాశం ఇవ్వాలని చూస్తుంది. అయితే టీమ్ బ్యాలెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని, అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది. అభిషేక్ శర్మ లేదా ట్రావిస్ హెడ్ అవుట్ అయితే, ఇషాన్ వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడితే జట్టు 200+ స్కోర్ చేయడం తేలికవుతుంది. ఇది SRHకు మంచివిధంగా పనిచేయొచ్చు. మొత్తానికి, SRH మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అతడిని స్టార్టింగ్ 11లోకి తీసుకుంటారా? లేక ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగిస్తారా? అది ఆ టైమ్‌కే తెలియాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories