
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇర్ఫాన్.. సౌరవ్ గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్ లెజెండ్రి క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా అని తెలిపాడు. తనకు అండగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు.
ఇర్ఫాన్ పఠాన్ 19 ఏళ్ల వయస్సులోనే టీమిండియాలో స్థానం సంపాదించాడు. 2003లో అరంగేట్రం చేసిన ఇర్పాన్ 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. కపిల్ దేవ్ బౌలింగ్ శైలితో అభిమానులు ఇర్ఫాన్ బౌలింగ్‌ను పోలుస్తారు. మూడు ఫార్మార్లలో కలిపి 306 వికెట్లు దక్కించుకున్నాడు.
మొదట బౌలర్ గా అరంగేట్రం చేసిన ఇర్ఫాన్ ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా రాణిస్తూ ఆల్ రౌండర్ అవతారం ఎత్తాడు. వన్డేల్లో 120, 173 వికెట్లు తీసుకున్నాడు. 27 పరుగులకే ఐదు వికెట్ల తీసిన రికార్డు సాధించాడు. ఇక 29 టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ చూస్తే టెస్టుల్లో 1105 పరుగులు సాధించాడు. అందులో ఏడు అర్థశతకాలు, ఒక శతకం నమోదు చేశాడు. వన్డేల్లో 15,44 పరుగులు సాధించాడు. ఐదు అర్థ శతకాలు ఉన్నాయి.
ఇర్ఫాన్ పఠాన్ కీలక సమయంలో జట్టును ఆదుకున్న ప్లేయర్ గా ఇర్ఫాన్ గుర్తిపు పొందాడు. పాకిస్థాన్‌పై టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 2006లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఇర్పాన్ పఠాన్ ఉన్నారు. టెస్టు మ్యాచ్ లో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ తీసి ఔరా అనిపించాడు.
9 ఏళ్లపాటు టీమిండియాకు సేవలందించాడు. 2012లో శ్రీలంకపై చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. పఠాన్ ప్రస్తుతం జమ్ముకాశ్మీర్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ విజయంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్ లో జరిగిన ఫైనల్ పోరులో 16పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
So many match winning spells, numerous match winning innings, one of the best all arounders I have played with. You are a true champion @IrfanPathan my friend. Good luck for your second innings. Cheers #irfanpathan pic.twitter.com/J5GyGhhQ6g
— Gautam Gambhir (@GautamGambhir) January 4, 2020
Was such a joy to see #IrfanPathan evolve from a aspiring 17yr old cricketer when I first saw him into a mature International Cricketer. You can be very proud of what u have achieved not only as a cricketer but also in mentoring young cricketers from J&K. A very happy 2nd innings pic.twitter.com/T63yF3G7z7
— VVS Laxman (@VVSLaxman281) January 4, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




