నీ ఆటను ఎప్పటికీ మరిచిపోలేము.. ఇర్ఫాన్‌ పఠాన్‌ భావోద్వేగ ట్వీట్‌

నీ ఆటను ఎప్పటికీ మరిచిపోలేము.. ఇర్ఫాన్‌ పఠాన్‌ భావోద్వేగ ట్వీట్‌
x
Highlights

ఐపీఎల్ సీజన్ -13 2020కోసం గురువారం వేలం నిర్వహించిన సంగతి తెలిసందే.

ఐపీఎల్ సీజన్ -13 2020కోసం గురువారం వేలం నిర్వహించిన సంగతి తెలిసందే. అయితే ఈ వేలంలో టీమిండియా క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కు మొండి చేయి ఎదురైంది. కనీస ధర రూ.1కోటి ఉన్న అతడిని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. అయితే దీనిపై యూసుఫ్ పఠాన్ సోదరుడు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఇబ్బందులు అన్ని తాత్కాలికమేనని అవి ఏమీ కూడా కెరీర్‌పై ప్రభావితం చేయవని పేర్కొన్నాడు.

యూసుఫ్ పఠాన్ ఐపీఎల్ 2008 -09 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2014లో మూడున్నర కోట్లు పెట్టి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 15 బంతుల్లోనే అర్థసెంచరీ, తోపాటుగా 2010 సీజన్‌లో సెంచరీ కొట్టి చేసి ఐపీఎల్‌లో రికార్డు సృష్టించాడు. మూడు సంవత్సరాలు కోల్‌కతాకు సేవలందించాడు. 2018 సీజన్లో పఠాన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వేలంలో కొనుగోలు చేసింది. 2019 సీజన్‌లో 10 మ్యాచ్‌లు పాటు ఆడి, 13.33 సగటుతో 40 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలానికి ముందు యూస‌ుఫ్ పఠాన్ ను విడుదల చేసింది. అయితే తాజాగా నిర్వహించిన వేలంలో ఏ ఫ్రాంచైజీ యుసుఫ్ పఠాన్ ను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు.

ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్విటర్‌లో స్పందించాడు. అత్యుత్తమ ఆటతీరును మరిచిపోలేమని, తాత్కాలిక ఇబ్బందులు ప్రభావితం చేయలేవని పేర్కొన్నాడు. నువ్వే అసలైన మ్యాచ్‌ విన్నర్‌వి అంటూ పఠాన్ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ఈ ఐపీఎల్ మొత్తం 62 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు 29 మంది విదేశీ ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ సీజన్ లో సన్ రైజర్స్ జట్టు మిచెల్ మార్ష్(ఆస్ట్రేలియా ) Rs. 2.00 కోట్లు, విరాట్ సింగ్, ప్రియామ్ గార్గ్ లాంటి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories