IPL Auction: నేడు ప్రారంభం కానున్న ఐపీఎల్ వేలం పాట

IPLAuction of Players to Begin Today in Dubai
x

IPL Auction: నేడు ప్రారంభం కానున్న ఐపీఎల్ వేలం పాట 

Highlights

IPL Auction: దుబాయ్‌లో జరగనున్న మినీ వేలం

IPL Auction: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దమైంది. ఈ ఏడాది నిర్వహించబోయే ఐపీఎల్ -17 సీజన్ కోసం నేడు దుబాయ్‌లో మినీ వేలం నిర్వహించనున్నారు. 333 మంది ఆటగాళ్లు అమ్మకానికి ఉండగా.. 77 ఖాళీలు ఉన్నాయి. 214 మంది భారతీయులు కాగా.. 119 మంది విదేశీయులు ఈ వేలంలో పాల్గొననున్నారు. అసోసియేట్‌ దేశాల నుంచి ఇద్దరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం 262. 95 కోట్లు ఉన్నాయి. కాగా.. గుజరాత్ టైటాన్స్‌ వద్ద అత్యధికంగా 38.15 కోట్లు, ఉంటే.. అత్యల్పంగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ దగ్గర 13.15 కోట్ల సొమ్ము ఉంది.

కాగా ఈ వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లకే అధిక డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. కాగా.. అన్ని జట్లకు పూర్తి స్థాయిలో ప్లేయర్లు ఉన్నప్పటికీ మెరుగైన ఆల్ రౌండర్ల కోసమే చూస్తున్నట్టు కోచ్‌లు.. మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఫ్రాంచైజీలు వారిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని క్రీడా నిపుణులు అంటున్నారు. గతేడాది ఐపీఎల్ వేలంలో సామ్‌ కర్రన్‌ మీద ఎక్కువగా ఖర్చు పెట్టారు. ఆర్చర్‌ మీద కూడా ముంబయి ఇండియన్స్‌ ఎక్కువగా వెచ్చించింది. ఎక్కువగా గాయాలు అయ్యేసరికి వదిలేసింది. లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్ స్టార్క్‌పైనే అందరి దృష్టి ఉన్నట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories