కరోనా కట్టడికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళం

కరోనా కట్టడికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళం
x
Sunrisers Hyderabad
Highlights

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాల చేస్తున్న ఈ పోరాటానికి సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు. పీఎం సహాయనిధితో పాటు రాష్ట్ర సీఎంల సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇక క్రీడా రంగం నుంచి యువరాజ్‌సింగ్‌ రూ. 50 లక్షలు, రోహిత్‌ శర్మ రూ. 80 లక్షలు, సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు, విరాట్‌ కోహ్లి దంపతులు రూ. 3 కోట్ల విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే...

తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ జట్టు ఫ్రాంచైజ్ ముందుకు వచ్చి తమ వంతుగా రూ. 10 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు ట్వీట్ చేసింది. కానీ ఆ విరాళాన్ని ఏ సహాయనిధికి ఇస్తున్నది అన్నది పేర్కొనలేదు.. ఈ విరాళంపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు. సన్‌టీవీ గ్రూప్‌ మంచి పనికి నడుం బిగించడం హర్షణీయమని వార్నర్‌ ట్వీట్ చేశాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories