IPL 2023 Playoffs: రసవత్తరంగా ప్లేఆఫ్స్ సంగ్రామం.. ఏ జట్టుకు ఎంత శాతం ఛాన్స్

IPL Playoffs Scenario After RCB Beats Rajasthan Royals And KKR Beats CSK
x

IPL 2023 Playoffs: రసవత్తరంగా ప్లేఆఫ్స్ సంగ్రామం.. ఏ జట్టుకు ఎంత శాతం ఛాన్స్

Highlights

IPL 2023 Playoffs: ప్లేఆఫ్స్ దగ్గరపడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్ కు చేరడం ఖాయం . అలాగే సీఎస్కే , ముంబై ఇండియన్స్ కూడా ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ రేసు నుంచి తప్పుకున్నట్టే.. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , రాజస్థాన్ రాయల్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు లో ఉన్నాయి.

IPL 2023 Playoffs: ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసు కోసం జట్లు బలంగా పోటీపడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మిగిలిన అన్ని జట్లు ఫ్లే ఆఫ్స్ రేసును సజీవంగా ఉంచుకున్నాయి. తప్ప క గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాయి. ప్రస్తుప్రస్తుతం ఏయే జట్టుకు ఎంత శాతం ఛాన్స్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

గుజరాత్ టైటాన్స్ :

ప్లే ఆఫ్స్ కు గుజరాత్ టైటా న్స్ చేరడం నా మమా త్రమేత్ర మే. ఇప్ప టికే పాయింట్ల పట్టికలో ఈ జట్టు అగ్రస్థాగ్రస్థానంలో ఉంది. ఈ జట్టు మరో రెండు మ్యా చులు ఆడాల్సి ఉంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ సన్ రైజర్స్ తో తలపడనుంది . ఈ మ్యా చ్ తర్వా త తన చివరి లీగ్ ను ఆర్సీ బీతో ఆడా ల్సి ఉంది. ఈ మ్యా చ్ మే 21న ఉంది. గుజరాత్ టైటాన్స్ ఒక్క మ్యా చ్ గెలిచినా ప్లే ఆఫ్స్ కు క్వా లిపై అవుతుంది.

చెన్నై సూపర్ కింగ్స్ :

కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి అనం తరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 15 పాయింట్లతో పట్టికలో రెండవ స్థానంలో ఉంది. ఈ జట్టు మరో మ్యా చ్ ఆడా ల్సి ఉంది. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్ర మించిన ఢిల్లీ క్యా పిటల్స్ తో చివరి లీగ్ మ్యా చ్ ఉంది. ఈ మ్యా చ్ గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకున్నట్లే. ఒకవేళ ఓడితే మాత్రం ముంబై, లక్నో టీమ్లు సీఎస్కే ను వనక్కి నెట్టే ఛాన్స్ ఉంది.

ముంబై ఇండియన్స్ :

ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ముంబై ఇండియన్స్ జట్టుకు పుష్క లంగా ఉన్నాయి. ప్రస్తుప్రస్తుతం ఈ టీమ్ ఖాతాలో ౧౪ పాయింట్లు ఉన్నాయి. ఈ టీమ్ మరో రెండు మ్యా చ్ లు ఆడాల్సి ఉంది. లఖ్ నవూ సూపర్ జెయింట్స్ తో మే 16న, సన్ రైజర్స్హై దరాబాద్ జట్టుతో మే 21న తలపడాలి. లఖ్ నవూతో జరిగే మ్యా చ్ లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ కుచేరిన మూడో టీమ్ గా ముంబై ఇండియన్స్ నిలుస్తుంది. సన్ రైజర్స్ ను సైతం ఓడిస్తే టాప్ 2 పొజిషన్ లో క్వా లిఫయర్ రౌండ్ కు చేరుకుంటుంది.

లఖ్ నవూ సూపర్ జెయింట్స్ :

లఖ్ నవూ సూపర్ జెయింట్స్ మరో రెండు మ్యా చులు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యా చుల ఫలితం పైనే లఖ్ నవూ భవితవ్యంతో పాటు ఇతర టీమ్ల భవితవ్యం కూడా ఆధా రపడి ఉంది. లఖ్ నవూ టీమ్ తన చివరి రెండు మ్యాచులను ముంబై, కోల్ కతాతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో లఖ్ నవూ ఓడితే ఆర్సీ బీ, ఆర్ ఆర్, పీబీకేఎస్ టీమ్లు లఖ్ నవూను అధిగమించే ఛాన్స్ల భిస్తుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ కూడా తన రెండు మ్యాచు లను ఓడిపోతే, లఖ్ నవూ మూడో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అంతేకాదు చెన్నై చివరి లీగ్ మ్యాచ్ ఓడి, ముంబై ఒక మ్యాచ్లో గెలిచి, లఖ్ నవూ చివరి రెండు మ్యాచుల్లో గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. లఖ్ నవూ తన రెండు మ్యా చుల్లో ఒక్కదాం ట్లో గెలిచినా ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్, కోల్ కతా ఎలిమినేట్ అవుతాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తన లీగ్ లో భాగంగా మరోరెండు మ్యా చులు ఆడాల్సి ఉంది. ప్రస్తుప్రస్తుతం ఈ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచు కోవాలం టేబెం గళూరు టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ టీమ్లను ఓడించాలి. ఈ రెండింటిలో ఒక్కదాం ట్లోఓడిపోయినా రాజస్థాన్ రాయల్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ ముందం జవేసినట్లు అవుతుంది.

కోల్ కతా నైట్ రైడర్స్ :

సీఎస్కేతో జరిగిన మ్యా చ్ లో గెలిచి కోల్ కతా నైట్ రైడర్స్ తన ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఈ టీమ్ మరో మ్యా చ్ ఆడాల్సి ఉంది. లఖ్ నవూ జట్టుతో జరిగే ఈ మ్యా చ్ లో కోల్ కతా తప్పనిసరిగా విజయం సాధించాలి. ఒకవేళ ఓడితే ఇంటి దారి పట్టాల్సిందే. లఖ్ నవూ టీమ పై విజయం సాధించినా కోల్ కతా క్వాలిఫయింగ్ రౌండ్ కి చేరుకుంటుందని కచ్చితంగా చెప్పలేం . ముంబై, బెంగళూ రు , రాజస్థా న్, పంజాబ్ జట్ల ఫలితా లపై కోల్ కతా నైట్ రైడర్స్ భవితవ్యం ఆధా రపడి ఉంది.

రాజస్థాన్ రాయల్స్ :

రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచులు ఆడి 12 పాయింట్లు సాధించింది. ఈ టీమ్ మరో మ్యా చ్ ఆడాల్సిఉంది. రాజస్థాన్ ప్లే ఆఫ్ అవకాశాలు కూడా ఇంచు మించు కోల్ కతా నైట్ రైడర్స్ మాదిరే ఉన్నాయి. పంజాబ్ పై గెలవడంతో పాటు ముంబై, లఖ్ నవూ, బెంగళూరు టీమ్స్ ఓడిపోవాలని రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రార్థించుకోవాలి. ఆర్సీ బీ చేతిలో చిత్తుగా ఓడడం తోనే రాజస్థాన్ రాయల్స్ కు ఇతర జట్లపై ఆధా రపడాల్సి నదుస్థితి ఏర్పడింది.

పంజాబ్ కింగ్స్ :

పంజాబ్ కింగ్స్ మరో రెండు మ్యా చులు ఆడాల్సి ఉంది. మే 17న ఢిల్లీ క్యాపిటల్స్ తో మే 19న రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ జట్టు అమీతు మీ తేల్చు కోవాలి. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే ఈ రెండు మ్యా చులు తప్పనిసరిగా నెగ్గాలి. అంతేకాదు , రాయల్ ఛాలెంజ్ బెంగళూరు , లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కనీసం ఒక్క మ్యా చ్ అయినా ఓడాలి. నెట్ రన్ రేట్ కూడా కీలకంగా ఉంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ :

సన్ రైజర్స్ ఖాతాలో ప్రస్తుప్రస్తుతం 8 పాయింట్లు ఉన్నాయి. ఈ జట్టు ఇంకా 3 మ్యాచులు ఆడాల్సి ఉంది. మే 15న గుజరాత్ టైటాన్స్ , మే 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , మే 21న ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు షెడ్యూ ల్అ య్యా యి. ఈ మూడు మ్యా చుల్లో గెలిస్తేనే సన్ రైజర్స్ కు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే గుజరాత్ టైటాన్స్ , ఆర్సీ బీ, ఎంఐ మూడు బలమైన జట్లే కాబట్టి గెలుపు సునాయాసం కాదు . గుజరాత్ టైటాన్స్ పైసన్ రైజర్స్ గెలిస్తే ఇతర జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు సైతం ప్రభాప్రభావితం అవుతాయి. ముంబై పై గెలిస్తే రోహిత్ సేనకుప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోతాయి.

ఢిల్లీ క్యా పిటల్స్ :

ఢిల్లీ క్యా పిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిందనే చెప్పాలి. వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ సేన మరో రెండు మ్యాచులు ఆడాలి. పంజాబ్, చెన్నైలతో తలపడాలి. పంజాబ్ పై గెలిస్తే ఆటీమ్ ప్లే ఆఫ్స్ కు ఢిల్లీ గండికొట్టినట్టవు తుంది. చెన్నై పై గెలిస్తే...ఢిల్లీకి ప్రత్యేప్రత్యేకంగా ఒరిగేదేమి లేదు కానీ, చెన్నై టాప్ 2 ప్లేస్ ని కోల్పోతుంది.

ఏ జట్టుకు ఎంత శాతం ఛాన్స్

GT --------98%

CSK--------90%

MI-------------80%

LSG-----------61%

RCB----------31%

Show Full Article
Print Article
Next Story
More Stories