IPL 2025: ఐపీఎల్ ఆడ‌తారా? బ్యాన్ త‌ప్ప‌దా? ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల ముందు సందిగ్ధం!

IPL 2025 : ఐపీఎల్ ఆడ‌తారా? బ్యాన్ త‌ప్ప‌దా? ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల ముందు సందిగ్ధం!
x

IPL 2025 : ఐపీఎల్ ఆడ‌తారా? బ్యాన్ త‌ప్ప‌దా? ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల ముందు సందిగ్ధం!

Highlights

IPL 2025: అస‌లే ఐపీఎల్ 2025 మ‌ళ్లీ మొద‌ల‌వుతుంద‌నే స‌రికి అభిమానులంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

IPL 2025: అస‌లే ఐపీఎల్ 2025 మ‌ళ్లీ మొద‌ల‌వుతుంద‌నే స‌రికి అభిమానులంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. కానీ ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌కు మాత్రం ఇది పెద్ద టెన్ష‌న్‌గా మారింది. ఎందుకంటే వాళ్లు మ‌ళ్లీ ఇండియా రావ‌డానికి అంత ఇష్టంగా లేర‌ట‌. ఈ నేప‌థ్యంలో వాళ్ల ముందు రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. ఒక‌టి ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచులు ఆడాలి, లేదంటే నిషేధం ఎదుర్కోవ‌డానికి రెడీగా ఉండాలి. అయితే ఆడ‌క‌పోతే బ్యాన్ వేస్తారా లేదా అనేది మాత్రం బీసీసీఐ ఫైన‌ల్ గా డిసైడ్ చేయాలి. కానీ ప్ర‌స్తుతానికి క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఈ విష‌యంలో త‌మ చేతులు దులుపుకుంది. ఐపీఎల్‌లో ఆడాలా వ‌ద్దా అనే నిర్ణ‌యాన్ని నేరుగా ప్లేయ‌ర్ల‌కే వ‌దిలేసింది. అంతేకాదు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ గురించి సాకులు చెప్పే ప్లేయ‌ర్ల‌కు దాని ప్రిప‌రేష‌న్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పేసింది.

మీకు గుర్తున్న‌ట్టే మే 9న భార‌త్-పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు పెర‌గ‌డంతో ఐపీఎల్ 2025కి బ్రేక్ ప‌డింది. కానీ ఇప్పుడు ఈ లీగ్ మ‌ళ్లీ మే 17 నుంచి స్టార్ట్ కానుంది. లీగ్‌లో గ్రూప్ స్టేజ్‌లో ఇంకో 13 మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఆ త‌ర్వాత క్వాలిఫ‌య‌ర్లు, ఎలిమినేట‌ర్‌, ఫైన‌ల్ మ్యాచులు ఉంటాయి. ఇంత‌కుముందు ఐపీఎల్ 2025 ఫైన‌ల్ మే 25న జ‌ర‌గాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది జూన్ 3కి మారింది. మ‌రి ఇదే ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల‌కు అస‌లు స‌మ‌స్య‌.

ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు ఎందుకంత టెన్ష‌న్‌లో ఉన్నారు?

అస‌లు విష‌యం ఏంటంటే జూన్ 11 నుంచి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కూడా ఉంది. ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో సౌతాఫ్రికాతో ఈ మ్యాచ్ ఆడ‌నుంది. ఐపీఎల్ 2025లో ఆడుతున్న చాలా మంది ప్లేయ‌ర్లు ఆ డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆడే ఆస్ట్రేలియా టీమ్‌లో ఉండేవాళ్లే. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల టెన్ష‌న్‌కి కార‌ణం ఏంటంటే, ఒక‌వేళ వాళ్ల టీమ్ ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్తే చాలా మంది ప్లేయ‌ర్ల‌కు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ప్రిపేర్ అవ్వ‌డానికి స‌రిప‌డా టైమ్ ఉండ‌దు. ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌కు ఉన్న భ‌యం కేవ‌లం డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ గురించే కాదు, ఐపీఎల్ టైమ్‌లో ఇండియాలో వాళ్ల సెక్యూరిటీ గురించి కూడా. ఎందుకంటే భార‌త్‌-పాక్ ఉద్రిక్త‌తల కార‌ణంగా వాళ్లు ఇక్క‌డ చూసిన సీన్ల‌తో చాలా డిస్ట‌ర్బ్ అయ్యార‌ట‌.

కానీ వాళ్ల బోర్డు అంటే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఐపీఎల్ విష‌యంలో వాళ్ల ఈ టెన్ష‌న్ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఐపీఎల్ ఆడాలా వ‌ద్దా అనేది డైరెక్ట్‌గా ప్లేయ‌ర్లే డిసైడ్ చేసుకోవాల‌ని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చి చెప్పేసింది. అంతేకాదు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ప్రిప‌రేష‌న్ గురించి పెద్ద‌గా వ‌ర్రీ అవ్వాల్సిన ప‌నిలేద‌ని కూడా చెప్పేసింది. ప్లేయ‌ర్లు ఒక‌వేళ ఐపీఎల్‌లో ఆడాల‌ని డిసైడ్ చేసుకుంటే, ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్ వాళ్ల కోసం డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ప్రిప‌రేష‌న్‌కు స్పెష‌ల్‌గా ప్లాన్ చేస్తుంద‌ని భ‌రోసా ఇచ్చింది. ఇక సెక్యూరిటీ విష‌యానికి వ‌స్తే, తాము ఆస్ట్రేలియా ప్ర‌భుత్వంతో, బీసీసీఐతో రెగ్యుల‌ర్‌గా ట‌చ్‌లో ఉన్నామ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది.

ఐపీఎల్ 2025లో ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు వీళ్లే:

ఐపీఎల్ 2025లో ఆస్ట్రేలియాకు చెందిన చాలా మంది ప్లేయ‌ర్లు వేర్వేరు టీమ్‌ల‌కు ఆడుతున్నారు. వాళ్ల పేర్లు ఇవిగో:

చెన్నై సూప‌ర్ కింగ్స్‌- నాథ‌న్ ఎల్లిస్‌

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌- మిచెల్ స్టార్క్‌, జాక్ ఫ్రేజ‌ర్

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌- స్పెన్స‌ర్ జాన్స‌న్‌

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్- మిచెల్ మార్ష్‌

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు- జోష్ హేజిల్‌వుడ్‌, టిమ్ డేవిడ్‌

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌- ప్యాట్ క‌మిన్స్‌, ట్రావిస్ హెడ్‌, ఆడ‌మ్ జంపా (బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు)

పంజాబ్ కింగ్స్‌- మార్క‌స్ స్టోయినిస్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు), మిచ్ ఓవెన్ (ఇంకా జాయిన్ అవ్వ‌లేదు), జోస్ ఇంగ్లిస్‌, ఆరోన్ హార్డీ, జేవియ‌ర్ బార్ట్‌లెట్‌

ప్లేయ‌ర్లు ఏ నిర్ణ‌యం తీసుకున్నా మేం స‌పోర్ట్ చేస్తాం - సీఏ

ఇప్పుడు చూడాలి క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఎలాంటి అభ్యంత‌రం లేక‌పోవ‌డంతో ఈ ప్లేయ‌ర్లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో. ముఖ్యంగా టెస్ట్ టీమ్‌లో ఉండే ప్లేయ‌ర్లు అంటే డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆడేవాళ్ల‌కు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం కాస్త క‌ష్టంగా ఉండొచ్చు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ప్లేయ‌ర్లు ఏ నిర్ణ‌యం తీసుకున్నా తాము స‌పోర్ట్ చేస్తామ‌ని చెప్పేసింది. అంటే వాళ్ల‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories