BCCIకు కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్ ఈ-వేలం

IPL e-auction is pouring cash into BCCI
x

BCCIకు కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్ ఈ-వేలం 

Highlights

IPL e-auction: *తొలి రోజే ప్రసార హక్కుల ధర 42వేల కోట్లు

IPL e-auction: IPL మీడియా ప్రసార హక్కుల కోసం ప్రారంభించిన వేలం BCCIకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆదివారం ఈ-వేలం ప్రారంభంకాగా..తొలి రోజే ప్రసార హక్కుల ధర 42వేల కోట్ల రూపాయలు పలికింది. వేలం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండగా..ఈ విలువ మరింత పెరుగుతుందని అంచనా. 2023-27 ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల కోసం ఈ వేలం ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే అంతా ఊహించినట్లుగానే భారీగా స్పందన వచ్చింది. వేలంకు బీసీసీఐ కనీస ధరను 32వేల, 440 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా..తొలి రోజే దాని ధర అంతకంతకు 10వేల కోట్ల రూపాయలకు చేరింది. 2017లో స్టార్ ఇండియా 2018-22 సీజన్ కోసం టీవీ, డిజిటల్ ప్రసారాలకు కలిపి 16వేల, 347 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరింది. అప్పటికీ అదే సరికొత్త రికార్డు కాగా..ఈసారి అంతకు మూడు రెట్లు ఎక్కువ సొమ్ము బీసీసీఐ ఖజానాలో చేరే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories