ఐపీఎల్ తర్వాత .. బతికుంటే చాలు

ఐపీఎల్ తర్వాత .. బతికుంటే చాలు
x
Suresh Raina
Highlights

దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 2500కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా.. 70 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.

దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 2500కుపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా.. 70 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.క‌రోనా మ‌హమ్మారి అన్ని రంగాల‌ను ప్ర‌భావితం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మ‌రి ధాటికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని ర‌కాల క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ్డాయి.

టోక్యో ఒలింపిక్స్ స‌హా అన్ని క్రీడా పోటీలు వాయిదా ప‌డ్డాయి. ఈ జాబితాలో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్ ) కూడా చేరింది. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ సీజ‌న్ 13 ఏప్రిల్ 15వ తేది వ‌ర‌కు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్ర‌క‌టించింది.

దేశ‌వ్యావ‌ప్తంగా ఈనెల 14 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో 15 నుంచి ఐపీఎల్ నిర్వ‌హించ‌డం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. తాజా ప‌రిస్థితులు చూస్తుంటే ఐపీఎల్ కంటే ప్రాణాలే ముఖ్య‌మ‌ని టీమిండియా క్రికెట‌ర్, చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌గాడు సురేశ్ రైనా వ్యాఖ్యానించాడు. క‌రోనాలాంటి సంక్షోభ ప‌రిస్థితుల్లో ప్ర‌జా భ‌ద్ర‌త‌కే ప్రాముఖ్య‌మివ్వాల‌ని రైనా అన్నాడు.

ఇక ఐపీఎల్ సురేష్ రైనా మాట్లాడుతూ.. టోర్నీ కోసం కొంత‌కాలం వేచిచూడ‌క త‌ప్ప‌ద‌ని రైనా తెలిపాడు. మ‌రోవైపు క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా కేంద్ర‌ ప్ర‌భుత్వం నిర్దేశించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌జ‌లు పాటించాల‌ని సూచించాడు. దేశంలో ప‌రిస్థితులు మెరుగుప‌డ్డాక, ఐపీఎల్ గురించి ఆలోచించ‌వ‌చ్చ‌ని తెలిపాడు. క‌రోనా వైర‌స్‌పై పోరాటానికి చేయూతనివ్వాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చ‌ని సంగ‌తి తెలిసిందే. ఈక్రమంలో సురేశ్ రైనా రూ. 52 ల‌క్ష‌లు ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories