IPL 2020: ఐపీఎల్ ఓకే... వరల్డ్ కప్ అలా అయితే కుదరదు

IPL 2020: ఐపీఎల్ ఓకే... వరల్డ్ కప్ అలా అయితే కుదరదు
x
Glenn Maxwell
Highlights

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి అన్ని రంగాలలో దెబ్బతీసింది.

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి అన్ని రంగాలలో దెబ్బతీసింది.కరోనా వలన అంతర్జాతీయ క్రీడలన్ని రద్దయ్యాయి. ఐపీఎల్ కూడా ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

అయితే ఐపీఎల్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని కొందరు క్రికెటర్లు, మాజీలు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్‌ను జరిపించవచ్చని, కానీ అలా ప్రపంచకప్‌ను నిర్వహించడం సాధ్యం కాదని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆసీస్‌ వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై కూడా సందేహాలు మొదలవుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసింది. అయితే ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేస్తే అక్టోబర్‌-నవంబర్‌లో ఐపీఎల్‌ నిర్వహించాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి.

అయితే స్టేడియంలో ప్రజలు లేకుండా ఐపీఎల్‌ను నిర్వహించొచ్చు. ప్రేక్షకుల లేకుండా మ్యాచ్‌లు అంటే కష్టతరం. కానీ, అలా ప్రపంచకప్‌ను నిర్వహించడం నేను చూడలేను. మెగాటోర్నీకి అభిమానులు లేకుండా ఏర్పాటు చేయడం సరికాదని మాక్స్‌వెల్‌ అన్నాడు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తే సమర్థించను. ప్రజలు శ్రేయస్సు, ఆరోగ్యం మనకి ముఖ్యం అని మాక్స్‌వెల్‌ తెలిపాడు.

మరోవైపు ఐపీఎల్ నిర్వహణపై నిర్ణయాన్ని బీసీసీఐ నేడు వెలువరించనుంది. ఈ మేరకు బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపారు. పరిస్థితులు గమనిస్తున్నమని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు ఎక్కడినుంచి వస్తారని గంగూలీ అన్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories