IPL 2025: బరిలోకి దిగారంటే ప్రత్యర్థులకు చెమటలే.. ఆ 3 జట్ల బ్యాట్స్‌మెన్స్‌ అంటే బౌలర్స్‌కు హడలే..

IPL 2025 Strongest Batsmen
x

IPL 2025: బరిలోకి దిగారంటే ప్రత్యర్థులకు చెమటలే.. ఆ 3 జట్ల బ్యాట్స్‌మెన్స్‌ అంటే బౌలర్స్‌కు హడలే..

Highlights

IPL 2025 Strongest Batsmen: శక్తివంతమైన బ్యాట్స్‌మెన్లు, ఐపీఎల్ 2025 బాట్స్‌మెన్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్, ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్, లక్నో సూపర్ జెయింట్స్, ఐపీఎల్ 2025 జట్లు.

IPL 2025 Strongest Batsman: టీ 20 లీగ్‌ అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఆటగాళ్లను ఆక్షన్‌లో కొనుగోళ్లు కూడా జరిగిపోయాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టీ 20 లీగ్‌ 18వ ఎడిషన్‌ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది.ట్ల పేరు బాగా వినిపిస్తోంది.

IPL 2025 Stongest Batsmans: ప్రపంచ క్రికెటర్లు అంతా ఒకే లీగ్‌లో ఆడతారు అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌). ఐపీఎల్‌ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 22వ తేదీ ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. ఇందులో ప్రధానంగా మూడు జట్ల గురించి చెప్పుకోవాలి. టీమ్‌ పరంగా చూస్తే ఈ జట్లు బలంగా ఉన్నాయి. టాప్‌ ఆర్డర్‌ స్ట్రాంగ్‌గా ఉండటమే కాదు ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్స్‌ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే, ఏ జట్టు బలం ఎంత ఉంది అని చూస్తే మాత్రం ఓ 3 జట్ల పేరు బాగా వినిపిస్తోంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ పేరు వింటనే ప్రత్యర్థి చుక్కలే అని చెప్పాలి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బలమైన బ్యాట్స్‌మెన్‌ కలిగి ఉంది. కావ్యమారన్‌ ఈ జట్టు సీఈఓ. అయితే, ఈ జట్టు బలమైన బ్యాట్స్‌మెన్‌ ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, నితీష్‌ రెడ్డి, క్లాసేన్‌, అభినవ్‌ మనోహర్, అర్థవ్‌ తైడే, మెండీస్‌, సచిన్‌, వియాన్‌ ఉన్నారు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్స్‌ 2025లో బలమైన బ్యాట్స్‌మెన్లను కలిగి ఉన్న మరో టీమ్‌ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ జట్టులో మిచెల్‌ మార్ష్‌ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. మార్కారమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, ఆయుష్‌ బదోని వంటి ప్రధాన ఆటగాళ్లు ఉన్నారు.


ముంబై ఇండియన్స్‌..

ఈ జట్టు కూడా బలమైన బ్యాట్స్‌మెన్లను కలిగి ఉంది. ప్రధానంగా రోహిత్‌ శర్మ, సూర్య కుమార్‌ యాదవ్‌, పాండ్యా, మిచెల్‌ సాంట్నర్ ర్యాన్‌ రికెల్టన్‌ వంటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. వీళ్లు ఎలాంటి బాల్‌ అయినా బౌండరీ దాటించేవారే అధికం.

ఐపీఎల్‌ 2025 ఈ నెల మార్చి 22 నుంచి మే 25 వరకు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 13 సిటీల్లో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ 20 మ్యాచ్‌ కోల్‌కతాలో ప్రారంభం కానుంది. బీసీసీఐ ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తుంది.

గ్రూప్‌ ఏ..

చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.

గ్రూప్‌ బీ..

ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స, లక్నో సూపర్‌ జెయింట్స.

Show Full Article
Print Article
Next Story
More Stories