IPL 2025: ఇర్ఫాన్ పఠాన్‌పై తీవ్రమైన ఆరోపణలు.. కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగింపు

IPL 2025 Serious Allegations Against Irfan Pathan Removed from Commentary Panel
x

IPL 2025: ఇర్ఫాన్ పఠాన్‌పై తీవ్రమైన ఆరోపణలు.. కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగింపు

Highlights

IPL 2025: క్రికెట్‌లో ఆటగాళ్లతో పాటు కామెంట్రీలు కూడా తమ కామెంట్రీతో మ్యాచ్ సమయంలో అభిమానుల్లో ఉత్సాహం పెంచుతారు.

IPL 2025 Serious Allegations Against Irfan Pathan

IPL 2025: క్రికెట్‌లో ఆటగాళ్లతో పాటు కామెంట్రీలు కూడా తమ కామెంట్రీతో మ్యాచ్ సమయంలో అభిమానుల్లో ఉత్సాహం పెంచుతారు. ఐపీఎల్ 2025 కోసం ఒక పెద్ద కామెంట్రీ ప్యానెల్ ను ప్రకటించారు. కానీ ఈసారి మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కామెంట్రీ ప్యానెల్‌లో లేరు. గత కొన్ని సంవత్సరాలుగా తను ప్రతి ప్రధాన క్రికెట్ ఈవెంట్‌లోనూ కామెంట్రీగా కనిపిస్తున్నాడు. కానీ ఈసారి జాబితాలో అతని పేరు కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈసారి ఐపీఎల్‌లో ఇర్ఫాన్ పఠాన్ ఎందుకు కామెంట్రీ చేయరనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో నమోదైంది.

కొంతమంది భారత ఆటగాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా ఇర్ఫాన్ పఠాన్‌ను కామెంట్రీ ప్యానెల్ నుంచి మినహాయించారు. కొంతమంది ఆటగాళ్ళు పఠాన్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఈ ఆటగాళ్ళు ఇర్ఫాన్ తమ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా కొంతమంది ఆటగాళ్ల గురించి ఇర్ఫాన్ పఠాన్ చెప్పిన దాని వల్ల ఇది జరిగిందని నమ్ముతున్నారు. అదే సమయంలో, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతని కామెంట్రీ తర్వాత ఒక ఆటగాడు అతనిని ఫోన్‌లో బ్లాక్ చేశాడని కూడా పేర్కొన్నారు..

ఇర్ఫాన్ పఠాన్ వ్యక్తిగతంగా కొంతమంది ఆటగాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అది సిస్టమ్ కు అస్సలు నచ్చలేదు. ఇది కాకుండా, తన వైఖరి కూడా ఒక పెద్ద కారణంగా పరిగణించారు. దీని కారణంగా బీసీసీఐ అతనిపై కోపంగా ఉంది. ఆటగాళ్ల ఫిర్యాదుల తర్వాత ఇర్ఫాన్ లాగానే సంజయ్ ను కూడా కామెంటరీ ప్యానెల్ నుండి తొలగించారు. సంజయ్ కొన్నేళ్ల తర్వాత కామెంట్రీ ప్యానెల్లో చేరారు.

ఐపీఎల్ 2025 కి కామెంట్రీ ప్యానెల్ లిస్ట్

నేషనల్ ఫీడ్ కామెంట్రీ- ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్, మైఖేల్ క్లార్క్, సునీల్ గవాస్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, మాథ్యూ హేడెన్, మార్క్ బౌచర్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, సురేష్ రైనా, ఆర్పీ సింగ్, షేన్ వాట్సన్, సంజయ్ బంగర్, వరుణ్ ఆరోన్, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, వీరేంద్ర సెహ్వాగ్, కేన్ విలియమ్సన్, ఎబి డివిలియర్స్, ఆరోన్ ఫించ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మహ్మద్ కైఫ్, పియూష్ చావ్లా.

వరల్డ్ ఫీడ్ కామెంట్రీ- ఇయాన్ మోర్గాన్, షేన్ వాట్సన్, మైఖేల్ క్లార్క్, గ్రేమ్ స్మిత్, హర్ష భోగ్లే, నిక్ నైట్, డానీ మోరిసన్, ఇయాన్ బిషప్, అలాన్ విల్కిన్స్, డారెన్ గంగా, నటాలీ జెర్మానోస్, రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, దీప్ దాస్‌గుప్తా, ఆరోన్ ఫించ్, వరుణ్ ఆరోన్, సైమన్ డౌల్, పొమ్మీ మ్బాంగ్వా, అంజుమ్ చోప్రా, కేటీ మార్టిన్, డబ్ల్యూవీ రామన్, మురళీ కార్తీక్.

Show Full Article
Print Article
Next Story
More Stories