IPL 2025: క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఎప్పుడో తెలుసా ?

IPL 2025: Schedule Details Revealed – First Match on March 22, KKR vs RCB at Eden Gardens
x

IPL 2025: క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఎప్పుడో తెలుసా ?

Highlights

IPL 2025: క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ వేదిక గురించి బీసీసీఐ ఇప్పటికే సమాచారం అందజేసింది.

IPL 2025: క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ వేదిక గురించి బీసీసీఐ ఇప్పటికే సమాచారం అందజేసింది. కానీ తేదీ, జట్ల గురించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. కానీ ఇప్పుడు ఇది కూడా వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ మార్చి 22, శనివారం జరుగుతుంది. ఇది డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభమవుతుంది. ఈ ఓపెనర్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ సొంత మైదానంలో.. అంటే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది.

SRH vs RR మధ్య 2వ మ్యాచ్

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. KKR, RCB మధ్య పోరు జరిగిన మరుసటి రోజే, గత సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 18వ సీజన్‌లో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23 ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ SRH హోమ్ గ్రౌండ్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగుతుంది. ఈ రోజు రెండు మ్యాచ్‌లు ఉండవచ్చు. టోర్నమెంట్ మ్యాచ్‌ల తేదీలను బిసిసిఐ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.. అయితే, కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌ల తేదీల గురించి ఆయా జట్లకు అనధికారికంగా తెలియజేసింది.

జనవరి 12న ముంబైలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో మార్చి 23న ఐపీఎల్ ప్రారంభం కావచ్చని బీసీసీఐ ఉపాధ్యక్షుడు సూచనప్రాయంగా తెలిపారు. కానీ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఇప్పుడు బోర్డు దానిలో కొన్ని మార్పులు చేసింది. టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్ రాబోయే 1 నుండి 2 రోజుల్లో విడుదల కావచ్చు. ఐపీఎల్ కొత్త సీజన్‌లో ఫైనల్‌తో సహా మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మొదటి మ్యాచ్‌తో పాటు, ఐపీఎల్ 2025 ఫైనల్ కూడా మే 25న జరుగుతుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రెండు ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి.

12 వేదికలలో మ్యాచ్‌లు

బీసీసీఐ వేదికలో కూడా కొన్ని మార్పులు చేసింది. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లు 10 చోట్ల కాకుండా 12 చోట్ల జరుగుతాయి. కొత్త సీజన్‌లో 2 వేదికలు యాడ్ అయ్యాయి. వాటిలో గౌహతి, ధర్మశాల ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఈ టోర్నమెంట్‌లో తమ రెండవ వేదికగా ధర్మశాలను ఎంచుకుంది. ఇక్కడ 3 మ్యాచ్‌లు ఆడవచ్చు. రాజస్థాన్ రాయల్స్ జైపూర్‌తో పాటు గౌహతిని తమ రెండవ వేదికగా చేసుకుంది. అక్కడ వారు మార్చి 26, 30 తేదీలలో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories