Rohit Sharma: రోహిత్‌ శర్మకు బిగ్‌ షాక్‌! ఇవాళే లాస్ట్ మ్యాచ్‌?

Rohit Sharma
x

Rohit Sharma: రోహిత్‌ శర్మకు బిగ్‌ షాక్‌! ఇవాళే లాస్ట్ మ్యాచ్‌?

Highlights

Rohit Sharma: ఇలా ఆడడానికి వస్తున్నాడు.. కళ్లు ఆర్పే లోపు పెవిలియన్‌కు వెళ్తున్నాడు.

Rohit Sharma: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు మహేంద్ర సింగ్ ధోనిని ఎంతగానో మోస్తున్నా.. ఇప్పుడు అదే పేరు వారికే భారంగా మారింది. మరోవైపు ముంబై ఇండియన్స్ అభిమానులు మాత్రం రోహిత్ శర్మను ఇప్పటికీ ఆశతో చూస్తున్నారు. ఒకప్పుడు తన ఆటతో మ్యాచ్‌ను తానే ఒంటరిగా నిలబెట్టిన ఆటగాడిగా నిలిచిన రోహిత్ శర్మ.. ఇప్పుడు ఆ స్థాయిని మళ్లీ పొందాలన్న ఆశతో అభిమానులు టీవీలకే అతుక్కుపోతున్నారు.

వాంఖేడే స్టేడియం అంటే రోహిత్‌కు సొంత మైదానం. అక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి స్టేడియం మొత్తం హోరెత్తిపోతుంది. అలాంటి ఆత్మీయత కలిగిన గ్రౌండ్‌లో రోహిత్ నిలవలేకపోవడం ముంబైకు కష్టంగా మారింది. గత సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల్ని హార్దిక్ పాండ్య తీసుకున్న తర్వాత, రోహిత్ పాత్ర కేవలం ఓ సీనియర్ ప్లేయర్‌గా మిగిలిపోయింది. కానీ అతని నుంచి అభిమానుల అంచనాలు మాత్రం తగ్గలేదు. మ్యాచ్ ప్రారంభమైన క్షణం నుంచి రోహిత్ బ్యాటింగ్‌కి దిగే వరకు ప్రతి ఒక్కరూ అతడి ఒక్క షాట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ సీజన్‌లో అతడు మంచి ప్రారంభాలు చేసినా, వాటిని పెద్ద ఇన్నింగ్స్‌లుగా మార్చుకోలేకపోతున్నాడు. ఇదే ప్రధాన సమస్యగా మారింది. ఒకప్పుడు స్ట్రోక్ ప్లేలో ఉత్సాహంగా కనిపించిన రోహిత్ ఇప్పుడు బౌలర్ల బలహీనతల్ని విశ్లేషించే ఆసక్తి కూడా చూపడం లేదన్నట్టుగా కనిపిస్తోంది. ఇలా ఆడడానికి వస్తున్నాడు.. కళ్లు ఆర్పే లోపు పెవిలియన్‌కు వెళ్తున్నాడు. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ కమ్‌బ్యాక్‌ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ అక్కడ కూడా తొలి ఆరు ఓవర్లను పూర్తిగా ఉపయోగించలేకపోయాడు. హార్దిక్ పాండ్య అద్భుతంగా ఆడినా, చివర్లో వికెట్లు కోల్పోవడం వల్ల ముంబై విజయాన్ని తాకలేకపోయింది. ఈ పరిస్థితిలో రోహిత్ శర్మ ఆరంభంలో మంచి రన్रेट ఇచ్చే అవకాశం ఉండి కూడా అది మిస్సవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది.

ముంబై ఇప్పటికే అయిదు మ్యాచ్‌లు ఆడగా, అందులో నాలుగు ఓడిపోయింది. ఇది వారి స్థాయికి పెద్ద ఎదురు దెబ్బ. ఓటములకు మొత్తం బాధ్యత రోహిత్ శర్మపై వేసే పరిస్థితి లేకపోయినా, టాప్ ఆర్డర్‌లో అతడి ఫెయిల్యూర్ మాత్రం జట్టును తలకిందులుగా మార్చేసింది. బాగా ఆడుతున్న రోజుల్లో అతడి బాడీ లాంగ్వేజ్ ఎంత చురుకుగా కనిపించేదో, ఇప్పుడు అదే ముఖంలో ఒక ఒత్తిడి, నిరుత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సీన్‌ ఇలానే కంటీన్యు అయితే ముంబై యాజమాన్యం త్వరలోనే పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకా రెండు మ్యాచ్‌లలోనూ రోహిత్ ప్రదర్శన ఇలానే ఉంటే.. అతడి స్థానం గల్లంతు అవ్వక తప్పదు. ఇప్పటికైనా రోహిత్ మేలుకొని తన స్థాయిని తిరిగి చూపించాలి. ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి టీమ్‌తో జరగబోయే మ్యాచ్‌ అతడికి మరో అవకాశం. ఆ మ్యాచ్‌లో తన అసలు సత్తా చూపించి అభిమానుల నమ్మకాని నిలబెట్టగలిగితే, ముంబై ప్రయాణం మళ్లీ విజయం బాటపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories