RCB vs MI: కోహ్లీ టీమ్‌ గజాగజా.. బుమ్రా ఇజ్‌ బ్యాక్? టీచర్‌ రిలీజ్ చేసిన రోహిత్‌ గ్యాంగ్!

RCB vs MI
x

RCB vs MI: కోహ్లీ టీమ్‌ గజాగజా.. బుమ్రా ఇజ్‌ బ్యాక్? టీచర్‌ రిలీజ్ చేసిన రోహిత్‌ గ్యాంగ్!

Highlights

RCB vs MI: ఫిట్‌నెస్‌ అనుకూలిస్తే, బెంగళూరుతో ఏప్రిల్‌ 7న జరగబోయే మ్యాచ్‌లో బుమ్రాను తుది జట్టులో ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.

RCB vs MI: ముంబై ఇండియన్స్‌కు బుమ్రా మళ్లీ లైన్‌లోకి వచ్చాడన్న వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహం నింపుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందురోజే, ముంబై తమ స్టార్ పేసర్ బుమ్రా జట్టుతో కలిసాడని అధికారికంగా తెలిపింది. ఇప్పటికే బుమ్రా జట్టు క్యాంపులో చేరిపోయాడు. కొన్ని వారాలుగా వెన్ను గాయంతో ఆటకు దూరంగా ఉన్న బుమ్రా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కూడా దూరమయ్యాడు. కానీ తాజా సమాచారం ప్రకారం, ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మాచ్ సిమ్యులేషన్‌లో పాల్గొన్నాడని తెలుస్తోంది. శారీరక స్థితిగతులు అనుకూలిస్తే, బెంగళూరుతో ఏప్రిల్‌ 7న జరగబోయే మ్యాచ్‌లో బుమ్రాను తుది జట్టులో ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.

బుమ్రా మళ్లీ జట్టులోకి రావడం ముంబై ఇండియన్స్‌కి బిగ్ రిలీఫ్‌గా మారనుంది. ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో ఆ జట్టు నాలుగు మ్యాచుల్లో మూడు ఓటములను చవిచూసింది. ఒక్క గెలుపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబైలో వచ్చిందిగానీ, మొత్తం మిగిలిన ప్రదర్శన నిరాశ కలిగించింది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి ఎదురుగా 204 పరుగుల ఛేదనలో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు విఫలమవడంతో జట్టు ఓటమి పాలైంది.

ఇప్పుడున్న ఫార్మ్‌ను బట్టి చూస్తే, బుమ్రా మళ్లీ జట్టులోకి రావడం ముంబై పేస్ బౌలింగ్ యూనిట్‌ను బలం కానుంది. ట్రెంట్‌ బౌల్ట్, దీపక్‌ చహార్‌, అశ్వని కుమార్‌లతో పాటు బుమ్రా రాకతో బ్యాలెన్స్ మరింత బలపడనుంది. ఇక అభిమానులంతా రానున్న RCB మ్యాచ్‌పై కన్నేశారు. బుమ్రా గ్రౌండ్‌లో కనిపిస్తాడేమో అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories