Salary of umpire: ఐపిఎల్ 2025 లో అంపైర్ల జీతాలు ఎంతో తెలుసా ?

Salary of umpire: ఐపిఎల్ 2025 లో అంపైర్ల జీతాలు ఎంతో తెలుసా ?
x
Highlights

Umpires salary in IPL 2025: ఐపిఎల్ అంటేనే ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు, ఆటతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ కాసుల వర్షం కురిపించే క్రికెట్ గేమ్. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడా సంస్థలలో బీసీసీఐ ఒకటి.

Umpires salary in IPL 2025


ఐపిఎల్ అంటేనే ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు, ఆటతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ కాసుల వర్షం కురిపించే క్రికెట్ గేమ్. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడా సంస్థలలో బీసీసీఐ ఒకటి. ఇక బీసీసీఐ నిర్వహించే ఐపిఎల్ గేమ్ అంటే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోండి. అంతేకాదు... ఇందులో బీసీసీఐతో సంబంధం లేకుండా ఫ్రాంచైజీలు కురిపించే కాసులే అధికం. బాగా పర్ ఫామ్ చేసే ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు కోట్లకు కోట్లు పెట్టి కొనుక్కుంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడిప్పుడే సత్తా చాటుకుంటున్న యువ ఆటగాళ్లకు కూడా ఫ్రాంచైజీలు లక్షల రూపాయలు పెట్టి మరీ సొంతం చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో చాలామందికి వచ్చే సందేహం ఒకటుంది. ఆటగాళ్లకు భారీగా డబ్బులు ఇస్తున్నారు సరే కానీ మరి ఐపిఎల్ మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేసే అంపైర్లకు ఎంత శాలరీ ఇస్తారనే సందేహం ఉన్న వారు కూడా ఉన్నారు. వారి కోసమే ఈ డీటేల్స్.

ఐపిఎల్ 2025 లో అంపైర్స్ శాలరీ

ఐపిఎల్ 2025 లో అంపైర్లకు ఒక్కో మ్యాచ్ కు రూ. 3 లక్షల జీతం ఇస్తారు. అంపైర్లే కాదు... వారికి సమాన స్థాయి ఉన్న సిబ్బంది అందరికీ అదే రకమైన శాలరీ ఉంటుంది. అయితే, ఫోర్త్ అంపైర్లకు మాత్రం రూ. 2 లక్షలే చెల్లిస్తారు. ఆటగాళ్లు మైదానంలో ఉన్నంత సేపు బౌలర్‌ను, బ్యాటర్స్‌ను, బంతి గమనాన్ని, బౌలింగ్ స్టైల్, బ్యాటింగ్ స్టైల్, ఫీల్డర్లను... ఇలా ప్రతీ ఒక్కరి కదలికలను అంపైర్లు నిశితంగా పరిశీలిస్తూనే ఉండాలి. అందుకే అది వారి కష్టానికి తగిన ఫలితమే అనే అభిప్రాయం కూడా ఉంది.

ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు ఎంత ఫీజు ?

ఐపిఎల్ ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్ కోసం రూ. 7.5 లక్షలు మ్యాచ్ ఫీజు అందుకుంటారు. ఇది వారు వేలంలో పలికిన ధరకు అదనం. అందుకే ఐపిఎల్‌లో ఆడిన ఆటగాళ్లు భారీ మొత్తంలో డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్పటివరకు ఆర్థిక ఇబ్బందులు పడిన ఆటగాళ్లు కూడా ఒక్క ఐపిఎల్ సీజన్‌లో వీలైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడారంటే వారి ఆర్థిక ఇబ్బందులు హుష్‌కాకీ అవ్వాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories