IPL 2025: ఆ విషయంలో పూర్తిగా విఫలం అయిన సూపర్ కింగ్స్..ఐపీఎల్ ఏ జట్టు పర్ఫామెన్స్ ఎలా ఉందంటే ?

IPL 2025: ఆ విషయంలో పూర్తిగా విఫలం అయిన సూపర్ కింగ్స్..ఐపీఎల్ ఏ జట్టు పర్ఫామెన్స్ ఎలా ఉందంటే ?
x
Highlights

IPL 2025: ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. లీగ్‌లో తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఆర్‌సిబి మధ్య జరగనుంది.

IPL 2025: ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. లీగ్‌లో తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఆర్‌సిబి మధ్య జరగనుంది. ఐపీఎల్ లీగ్ ప్రారంభానికి ముందు గత 17 సంవత్సరాలలో అన్ని జట్లు ఎలా ప్రదర్శన ఉందో తెలుసుకుందాం. ఏ జట్టు అత్యంత సక్సెస్ అయిందో.. ఏ జట్టు అత్యధిక ఫైనల్ మ్యాచ్‌లలో ఓడిపోయిందో చూద్దాం. ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ అనేక చారిత్రాత్మక క్షణాలను అందించింది. అనేక జట్లు తమ అద్భుతమైన ప్రదర్శనలతో చరిత్ర సృష్టించాయి. గత సీజన్లలో అన్ని జట్లు గెలుపు ఓటముల గురించి తెలుసుకుందాం.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఈ జట్టు 5 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఈ జట్టు గరిష్టంగా 5 సార్లు ఫైనల్స్‌లో ఓడిపోయింది. కెప్టెన్ ధోనీ వ్యూహాలు వారిని ఐపీఎల్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీగా నిలిచాయి. ఇప్పుడు జట్టు కెప్టెన్‌గా రీతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. అతను ఆరోసారి జట్టును ఛాంపియన్‌గా చేస్తాడని భావిస్తున్నారు.

గెలిచిన సీజన్‌లు: 5 (2010, 2011, 2018, 2021, 2023)

రన్నరప్: 5 (2008, 2012, 2013, 2015, 2019)

ప్లేఆఫ్‌లు: 12

మొత్తం సీజన్లు: 15

ముంబై ఇండియన్స్ (MI)

CSK లాగానే ముంబై ఇండియన్స్ కూడా ఐదుసార్లు IPL ఛాంపియన్‌గా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ జట్టు నిలకడగా అద్భుతంగా రాణించింది. 2010లో MI ఫైనల్‌లో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత కూడా వారు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఇప్పుడు జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. గత సీజన్లో ఈ జట్టు చివరి స్థానంలో ఉంది. ఇప్పుడు పాండ్యా నుంచి అద్భుత కెప్టెన్సీని ఆశిస్తున్నారు.

గెలిచిన సీజన్‌లు: 5 (2013, 2015, 2017, 2019, 2020)

రన్నరప్: 1 (2010)

ప్లేఆఫ్‌లు: 10

మొత్తం సీజన్లు: 17

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)

2012, 2014 సంవత్సరాల్లో గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు టైటిల్ గెలుచుకుంది. 2024లో కూడా అది మూడవసారి ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. కాకపోతే ఈ సారి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆ జట్టు 10 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు జట్టు కెప్టెన్ అజింక్య రహానే, కోల్‌కతా తన టైటిల్‌ను నిలబెట్టుకోగలదా లేదా అనేది చూడాలి. 2021లో జరిగిన ఫైనల్‌లో KKR ఓటమిని ఎదుర్కొంది.

గెలిచిన సీజన్లు: 3 (2012, 2014, 2024)

రన్నరప్: 1 (2021)

ప్లేఆఫ్‌లు: 8

మొత్తం సీజన్లు: 17

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి.. ఇప్పటివరకు ఏకైక ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2018, 2024లో ఫైనల్స్‌కు చేరుకుంది కానీ గెలవ లేకపోయింది.

గెలిచిన సీజన్లు: 1 (2016)

రన్నరప్: 2 (2018, 2024)

ప్లేఆఫ్‌లు: 7

మొత్తం సీజన్లు: 12

రాజస్థాన్ రాయల్స్ (RR)

రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మొదటి సీజన్ (2008)లో ఛాంపియన్ జట్టు. షేన్ వార్న్ కెప్టెన్సీలో అతను చరిత్ర సృష్టించాడు. 2022లో వారు ఫైనల్‌కు చేరుకున్నారు. కానీ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయారు.

గెలిచిన సీజన్లు: 1 (2008)

రన్నరప్: 1 (2022)

ప్లేఆఫ్‌లు: 6

మొత్తం సీజన్లు: 15

గుజరాత్ టైటాన్స్ (జిటి)

2022లో గుజరాత్ టైటాన్స్ తన తొలి సీజన్‌లోనే IPL గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో వారు 2023లో కూడా ఫైనల్స్‌కు చేరుకున్నారు కానీ CSK చేతిలో ఓడిపోయారు.

గెలిచిన సీజన్లు: 1 (2022)

రన్నరప్: 1 (2023)

ప్లేఆఫ్‌లు: 2

మొత్తం సీజన్లు: 3

డెక్కన్ ఛార్జర్స్

2009లో డెక్కన్ ఛార్జర్స్ IPL గెలిచింది. కానీ ఆ జట్టు తరువాత రద్దు అయింది.

గెలిచిన సీజన్లు: 1 (2009)

రన్నరప్: 0

ప్లేఆఫ్‌లు: 2

మొత్తం సీజన్లు: 5

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

ఆర్‌సిబి ఐపిఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటి.. కానీ ఇప్పటివరకు వారు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. అది 3 సార్లు ఫైనల్స్‌కు చేరుకుది. కానీ ప్రతిసారీ ఓటమిని ఎదుర్కొంది. ఇప్పుడు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్, తొలిసారిగా జట్టుకు నాయకత్వం వహించనున్నారు.

గెలిచిన సీజన్లు: 0

రన్నరప్: 3 (2009, 2011, 2016)

ప్లేఆఫ్‌లు: 9

మొత్తం సీజన్లు: 17

ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. ఈ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కూడా కెప్టెన్‌గా ఉన్నాడు.

గెలిచిన సీజన్లు: 0

రన్నరప్: 1 (2020)

ప్లేఆఫ్‌లు: 6

మొత్తం సీజన్లు: 17

పంజాబ్ కింగ్స్ (PBKS)

2014లో పంజాబ్ కింగ్స్ ఫైనల్స్‌కు చేరుకుంది, కానీ KKR చేతిలో ఓడిపోయింది. గత సీజన్‌లో KKRను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

గెలిచిన సీజన్లు: 0

రన్నరప్: 1 (2014)

ప్లేఆఫ్‌లు: 2

మొత్తం సీజన్లు: 17

ఇతర జట్లు

రైజింగ్ పూణే సూపర్ జెయింట్: 1 సారి ఫైనలిస్ట్ (2017), 2 సీజన్లు

లక్నో సూపర్ జెయింట్స్ (LSG): 2 సార్లు ప్లేఆఫ్స్, 3 సీజన్లు

గుజరాత్ లయన్స్†: 1 సారి ప్లేఆఫ్స్, 2 సీజన్లు

పూణే వారియర్స్ ఇండియా: ప్లేఆఫ్‌లు లేవు, 3 సీజన్లు

కొచ్చి టస్కర్స్ కేరళ: ప్లేఆఫ్‌లు లేవు, 1 సీజన్

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లు నిలకడగా మంచి ప్రదర్శన చేస్తూ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా, ఆర్‌సిబి, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు తమ తొలి టైటిల్‌ను గెలుచుకోవడానికి ఇంకా కష్టపడుతున్నాయి. రాబోయే సీజన్‌లో మరింత ఉత్తేజకరమైన క్రికెట్ జరుగుతుందని ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories